Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 * కెసిఆర్ ‘నాకొడుకు’ లన్నోళ్లంతా ఒకపుడు ఆయన స్నేహితులే

  *యశోదలో చికిత్స పోందుతున్న తుమ్మల

* తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

* రాహుల్ గాంధి కారుపై రాళ్లతో దాడి చేసిన దుండగులు

* ముగిసిన పీఎం భార్గవ అంత్యక్రియలు

* శిల్పా సోదరులపై నంద్యాల మహిళలు ఆగ్రహం 

* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

asianet telugu express news  in brief

 ఈ నెల 12, 13 వ తేదిన జరగాల్సిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా

ఈ నెల 12, 13వ టీఎస్‌పీఎస్సీ తలపెట్టిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పరీక్షలను వాయిదా వేసింది. ఇదే నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. అదే రోజున  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే వాయిదా వేస్తున్నట్లు  టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

*** ***

శిల్పా మోహన్ రెడ్డి ఇంటిముందు మహిళల దర్నా

నంద్యాలలో శిల్పా బ్రదర్స్ కి వ్యతిరేకంగా కొందరు స్థానిక మహిళలు దర్నా నిర్వహిస్తున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి మహిళల్ని కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా నంద్యాలలోని మోహన్ రెడ్డి ఇంటి ఎదుట ఆదోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇందంతా టిడిపి నాయకుల కుట్రగా వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది.
 

*** ***

ముగిసిన పీఎం భార్గవ అంత్యక్రియలు

జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సీసీఎంబీ వ్యవస్థాపకుడు పీఎం భార్గవ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. భార్గవ భౌతికకాయం వద్ద గాల్లోకి కాల్పులు జరిపి పోలీసులు గౌరవవందనాన్ని సమర్పించారు.   

*** ***

కేసీఆర్ పై  SC.ST అట్రాసిటీ కేసును నమోదు చేయాలని పిర్యాదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఆమె గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడిన సీఎంపై  SC.ST అట్రాసిటీ కేసును నమోదు చేయాలంటూ  తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి నాచారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చాశారు.
 

*** ***

వేములవాడ డీఎస్పీని కలిసిన నేరెళ్ల బాధితులు

ఇసుక లారీల దహనం కేసులో పోలీసులు తమను కులం పేరుతో దూషించారని నేరెళ్ల భాదితులు వేములవాడ డీఎస్పీకి పిర్యాధు చేశారు. ఎస్పీ విశ్వజిత్, సీసీఎస్ ఎస్సై రవీందర్‌పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసుపెట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే  తమపై దాడి జరగలేదని తప్పుడు  మెడికల్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సిరిసిల్ల డాక్టర్లపైన   బాధితులు ఫిర్యాదులు పిర్యాదు చేశారు.
 

*** ***

'సిస్ట‌ర్4 ఛేంజ్'  తో దూసుకుపోతున్న కవితక్క

 నిజాంబాద్ ఎంపి కవిత చేపట్టిన ‘సిస్ట‌ర్4ఛై్ంజ్ వెబ్‌సైట్‌’ను ఈ రోజు లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న్ ప్రారంభించారు.  పార్ల‌మెంటులో త‌న ఛాంబ‌ర్‌లో స్పీక‌ర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చెల్లెలికి సోద‌రుడు ర‌క్ష‌- సోద‌రుడికి హెల్మెట్ ర‌క్ష నినాదంతో నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సిస్ట‌ర్4ఛేంజ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఎంపి క‌విత చేస్తున్న కృషిని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ అభినందించారు. సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్ర‌తి మ‌హిళా కూడా త‌న సోద‌రులు క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటూ  రాఖీ పండుగ నాడు అన్న‌ద‌మ్ముల్ల‌కు రాఖీలు క‌డుతుంటార‌ని స్పీక‌ర్ తెలిపారు. రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోతున్న బ్ర‌ద‌ర్స్‌ను చూసి ఎంపి క‌విత‌ చ‌లించి పోయార‌ని, హెల్మెట్ ధ‌రించాల‌న్న అవగాహ‌న క‌ల్పించ‌డ‌మే టూవీల‌ర్స్ ప్రాణాల‌ను కాపాడేందుకు వీల‌వుతుంద‌ని ఆమె భావించార‌న్నారు.  క‌విత‌ తాను కూడా సోద‌రికావ‌డం వ‌ల్లే ఇలా స్పందించి..సిస్ట‌ర్స్ 4ఛేంజ్ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చార‌ని తెలిపారు. ఈ ప్ర‌చార ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌న్నారు సుమిత్రా మ‌హాజ‌న్‌. 
 

భారత్ వైపు మొగ్గుతున్న రెండవ టెస్ట్

శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్ట్ లో భారత్ ఆధిక్యం కొనసాగుతుంది. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు నష్టపోయి 50 పరుగులు చేసింది.  అంతకు ముందు భారత్ 9 వికెట్ల నష్టపోయి 622 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.  
 

*** ****

రాహుల్ పై రాళ్లదాడి

asianet telugu express news  in briefగుజరాత్ పర్యటనలో రాహుల్ కారు పై రాళ్లతో దాడి చేసిన దుండగులు. సురక్షితంగానే ఉన్న రాహుల్. కాంగ్రెస్ నేత భగత్ సింగ్ సోలంకికి గాయాలు.ఇది  బీజేపి గుండాల పనే అంటున్న కాంగ్రెస్ నేతలు.

 

 

*** ***

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన సచివాలయంలో  గొర్రెల పంపిణీ, చేపల పెంపకం పై  మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది.  దీనికి మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనావాస్, జోగు రామన్న,   ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*** ***

లాాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్‌మార్కెట్లు  రెండు రోజులుగా నష్టాలను చవిచూసి  వారాంతంలో కోలుకున్నాయి. ఆరంభంలో నష్టాలను చవిచూసి, మధ్యాహ్నానం నుంచి లాభాలను పండించాయి.  

*** ***

సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన  సుమిత్రా మ‌హాజ‌న్

సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ వెబ్‌సైట్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్రారంభించారు.  హెల్మెట్‌పై  ధరించే వాహనాలను నడపాలన్న ఉద్దేశంతో ఎంపీ క‌విత సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.   ఆడ‌ప‌డుచులు తమ అన్న‌య్య‌ల‌కు రాఖీతో పాటు హెల్మెట్‌ను బ‌హూక‌రించాల‌న్నదే   సిస్ట‌ర్స్‌ఫ‌ర్‌ఛేంజ్‌ కార్యక్రమం.
 

*** ***

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన  టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్  1 ఫలితాల్లో  57.37 శాతం ఉత్తీర్ణత.పేపర్ 2 లో 19.51 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.ఫలితాల కోసం tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.  

 

*** ***

asianet telugu express news  in brief

మంత్రి తుమ్మల ఆరోగ్యం బాగాలేక యశోద హాస్పిటల్లో చేరారు.అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని  యశోద వైద్యులు తెలిపారు. అల్సర్ వల్లే రక్తపు వాంతులు సంభవించాయని ఇపుడు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.తు

 

*** ***

మంటల్లో దుబాయ్ టార్చ్ టవర్​

 

దుబాయ్ టార్చ్ టవర్ మంటల్లో చిక్కుకుంది. ఇది ప్రపంచంలో  అత్యంత పొడవైన బిల్డింగ్ లలో ఇదొకటి. ఇదిన 86 అంతస్తులు ఉన్న బిల్డింగ. టార్చ్ టవర్ 14వ అంతస్తులో ఈ రోజు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు 30 అంతస్తుల వరకూ వ్యాపించాయి. 

 

***  ***

కెసిఆర్ ‘నాకొడుకు’లన్నోళ్లంతా ఒకప్పుడు స్నేహితులే​

asianet telugu express news  in brief

ఈ పోటో  ఇపుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఉంది.ఫోటో లో ఉన్నవాళ్లంతా ఇపుడు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు స్నేహితులే. తమాషా ఏమంటే, ఆయన మొన్న విలేకరుల సమావేశంలో ‘నా కొడుకులు’ అని ధూషించిన వాళ్లు కూడా వాళ్లే. రాజకీయాలలో స్నేహం, శతృత్వం ఎలా మారిపోతుంటాయో  అని చెప్పేందుకు ఈ ఫోటో సాక్ష్యం.

కమ్యూనిస్టులను ఆయన  నాకొడుకులనడంతో రాష్ట్రంలో పెద్ద దూమారమే రేగింది. అన్ని వర్గాల నుంచి తీవ్రమయిన విమర్శలొస్తున్నాయి. కెసిఆర్ భాషను సమర్ధించుకోవడం టిఆర్ ఎస్ నేతలకు చాలా కష్టంగా ఉంది.

 

 

***  ***

 

కేంద్ర మంత్రి గడ్కరీ ని కలసిన ఎంపీ కవిత

asianet telugu express news  in brief

న్యూఢిల్లీ:  నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లా కేంద్రం చుట్టూ బైపాస్ రోడ్లు వేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర రోడ్లు,  హైవేస్, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ ని కోరారు. శుక్రవారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆమె గడ్కరీ ని కలిశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న జగిత్యాల టౌన్ కు ధర్మపురి, కరీంనగర్, కోరుట్ల -మెట్ పల్లి నుండీ వచ్చే వాహనాలు టౌన్ లో ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నాయని కవిత మంత్రి గడ్కరీ కి వివరించారు.

* ధర్మపురి నుండి వచ్చే వాహనాల కోసం చల్ గల్-పొలాస వరకు బై పాస్ రోడ్ నిర్మించాలని కోరారు.*అలాగే చల్ గల్, అంతర్గామ్ మీదుగా దరూర్ లేదా రాజారామ్ వరకు నిజామాబాద్- కరీంనగర్ రోడ్ ను కలిపేలా మరో బైపాస్ రోడ్ వేయాలని కోరారు.*NH563-NH63 ని కలిపేలా దరూర్, నర్సింగపూర్ మీదుగా పొలాస వరకు బైపాస్ రోడ్ వేయాలని ఎంపి కవిత నితిన్ గడ్కరీ ని కోరారు.

 

కర్నాటక మంత్రి ఇంటిపై ఐటి దాడులు ముఖ్యమంత్రి పనేనా?

బెంగళూరు: సంచలనం సృష్టించిన కర్నాటక మంత్రి డి కె శివకుమార్ ఇంటి మీద ఆదాయపుపన్ను శాఖ వారి దాడుల వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేఉన్నారా? మంత్రి శివకుకుమార్ తల్లియే స్వయాన ఈ ఆరోపణ చేశారు. ‘నా కుమారుడి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడం వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉంది’ అని కర్ణాటక మంత్రి శివకుమార్‌ తల్లి గౌరమ్మ ఆరోపించారు. రెండు రోజులుగా మంత్రి శివకుమార్‌ ఆస్తులు, వ్యాపారసంస్థలు, స్నేహితులు, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతూండటమీద ఆమె ఇలా వ్యాఖ్యానించారు.

బెంగళూరు:

సంచలనం సృష్టించిన కర్నాటక మంత్రి డి కె శివకుమార్ ఇంటి మీద ఆదాయపుపన్ను శాఖ వారి దాడుల వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేఉన్నారా? మంత్రి శివకుకుమార్ తల్లియే స్వయాన ఈ ఆరోపణ చేశారు. ‘నా కుమారుడి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడం వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉంది’ అని కర్ణాటక మంత్రి శివకుమార్‌ తల్లి గౌరమ్మ ఆరోపించారు. రెండు రోజులుగా మంత్రి శివకుమార్‌ ఆస్తులు, వ్యాపారసంస్థలు, స్నేహితులు, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతూండటమీద ఆమె ఇలా వ్యాఖ్యానించారు.

*** ***

మఛిలీపట్నం:  ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్దునుడు .క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న జగన్ నే  ప్రజలే తూట్లుతూట్లుగా కాల్చి చంపుతారని వారు విమర్శించారు. హద్దులు దాటి విమర్శలు చేస్తున్న జగన్ ఓ సంస్కారహీనుడు.

*** ***

నామినేషన్‌ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి

కర్నూలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

***  *** ***

వెలగపూడి సచివాలయం: జగన్ మీద నిప్పులు కురిపించిన   మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద బాబు ఎమ్మెలు లు ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్

*ఆవు చెేలో మెస్తే దూడ గట్టుమీద మెయ్యదన్న సామెత. తాత రాజరెడ్డినుంచి తండ్రి రాజశేఖర్ రెడ్డి ,జగన్మోహన్ రెడ్డి  కుటుంబం  నేర చరిత్ర  రాష్ట్ర ప్రజలకు తెలుసు.

*  క్రిమినల్ స్వభావం గల  వ్యక్తి ముఖ్యమంత్రి ని నడి రోడ్డు పై కాలుస్తాననడం పై ప్రజలు ఒక సారి  ఆలోచించాలి.

* విధ్వంసం కర మాటలతో ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు అతనికి ఖచ్చితంగా బుద్ది చెబుతారు.

*కొత్తగ ఏర్పాడిన రాష్ట్రన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే.ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటూ ,అభివృద్ధి నిరోధకుడిగా తయారు అయ్యడు.

*నంద్యాల ఉప ఎన్నిక్కల్లో నే కాదు వచ్చే ఎన్నికల్లో అతని పార్టీ కి మనుగడ అనేది లేకుండా పోతుంది.ప్రజలే అతనికి బుద్ధి చెబుతారు.

*** *** ***

asianet telugu express news  in brief

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైద్య కళాశాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని కరీంనగర్  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ప్రభుత్వం  మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో  ఆయన శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీపై వెనక్కి తగ్గేది లేదని మాజీ ఎంపీ పొన్నం అన్నారు.

 

*** *** ***

నిన్న నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలుచేసినందుకు ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద చర్య తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

***

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద జగన్  చేసిన వ్యాఖ్యలు (రోడ్డు మీ ద కాల్చిచంపేయండి) ఆవేదన కల్గించాయి.  జగన్ లో ఒక ఉన్మాది దాక్కుని ఉన్నాడని మంత్రి అచ్చెన్నాయుడు అమరావతిలో వ్యాఖ్యనించారు. 

***

 

తెలంగాణా జడ్చర్ల పట్టణంలోని అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి(ఏసీటీవో) సురేందర్‌ గౌడ్‌ ఇంటిపై శుక్రవారం మహబూబ్‌నగర్‌ అనినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు . డీఎస్పీ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున  నగదు,  విలువైన ఆస్తుల పత్రాలు, 298 గ్రాముల బంగారం, 1.3 కేజీల వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.   

***

హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ విచారణ ను కొత్త మలుపుతూ డ్రగ్స్ సరఫర  చేసే లేడీ డాన్ సంగీతను పోలీసులు అరెస్టు చేశారు. బాయ్ ఫ్రెండ్ తో కలసి ఆమె డ్రగ్స్ వ్యాపారంతో పాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తూఉందని అనుమానం

***

విశాఖపట్నం: ఎపిలోని విశాఖపట్నం జిల్లా సబ్బవరం  మండల పరధిలోని రావులమ్మపాలెం దారుణం జరిగింది. చెత్త వేశాడనే నెపంతో ఒక వ్యక్తిని పొరుగుంటివారు దారుణంగా హతమార్చారు.  శ్రీనివాసులు అనే వ్యక్తి భార్య, కుమారుడు, కుమార్తెలతో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వీళ్ల పక్కింట్లోనే లంక అప్పలనాయుడు కుటుంబం ఉంటోంది.అయితే గురువారం రాత్రి ఇరుకుటుంబాల మధ్య చెత్త విషయంపై  గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.  దాంతో అప్పలనాయుడు కుటుంబ సభ్యులు శ్రీనివాసులుపై రాయితో దాడి చేశారు. అతను అక్కడిక్కడే చనిపోయాడు.

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios