నేటి తెలుగు రాష్ట్రాల విశేషాలు

Asianet Telugu Express news Andhra Telangana national crime
Highlights

విజయవాడ లోక్ సభ నియోజకవర్గ టిడిపి సమావేశం

భద్రాద్రి మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్

భద్రాచలం రామాలయం అభివృద్ధి మాస్టర్ ప్లేన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్ ...

నవంబర్ 9 -28 మధ్య తేదీల్లో ఎదో ఒక రోజు సీఎం భద్రాద్రికి రాక ...

అభివృద్ధి పనులకు శంకుస్తాపన.

పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు


యావత్ తెలుగు జాతి తో పాటు దేశ ప్రజలందరికి తన తరపున,జనసేన పార్టీ తరపున జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని సందేశాన్ని ఇచ్చారు.పిల్లలు టపాసులు కాల్చేటపుడు పెద్దలు దగ్గరుండి శ్రద్ద చూపాలని మనవి చేసారు. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులు అందించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం టిడిపి సమావేశం

 

 

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంఛార్జ్,మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం ప్రారంభమయింది.సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొటున్నారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సమావేశాన్ని  నారా లోకేష్ ప్రారంభించారు.

టిిడిపిని కుదిపేసిన రేవంత రెడ్డి  పార్టీ మారుడు వ్యవహారం

 

తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడని, ఆయన నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిశాడన్న వార్త తెలుగుదేశం పార్టీ ని కుదిపేస్తున్నది. పార్టీ మార వద్దని బుజ్జగించేందుకు   ప్రయత్నాలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడి దూత గా మాజీ ఎంపి కంభం పాటి రామ్మోహన్ రావు  ఈ రోజు రేవంత్ ను కలిశారు. అమెరికా విమానం ఎక్కేముందు చంద్రబాబు నాయడు సంగతేమిటో కనుక్కోమని కంభంపాటి ని పురమాయించినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వెళ్లిపోతే, తెలంగాణ టిడిపి మూత పడినట్లే. ఎందుకంటే, ఇపుడు టిడిపి ఇంకా సజీవంగా ఉందనేందుకు రేవంత్ రెడ్డి సాగిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటమే సాక్ష్యం. రేవంత్ పోతో పార్టీ పేరు కూడా తెలంగాణ లో వినిపించదు. ఇది ఇలా ఉంటే రాత్రి ఢిల్లీలో చంద్రబాబు ను కలుసుకునేందుకు  రేవంత్ ప్రయత్నించారని, ముఖ్యమంత్రి అప్పాయంట్ మెంట్ ఇవ్వలేదని పార్టీలోని ఒక వర్గం చెబుతున్నది. అయితే, రేవంత్ వ్యవహారం గమనిస్తూ ఉండండని ఆయన టిడిపి నేతలుకు చెప్పి తొమ్మిది రోజుల విదేశీ యాాత్రకు బయలు దేరి వెళ్లారు. తర్వాత కంభంపాటి మాట్లాడుతూ జరగుతున్నదేమిటో కనుక్కోవడం పార్టీ అధికార ప్రతినిధిగా నా బాధ్యత అందుకే రేవంత్ ను కలిశానని చెప్పారు. రేవంత్ పార్టీ మారతాడనుకోననని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ ఆంధ్ర పర్యటన, వెలమ, కమ్మల  జాయింట్ వెంచర్ వెల్ కమ్  గురించి తెలియదని కంభంపాటి అన్నారు.

 వరంగల్ లో మెగా టెక్స్ లైట్ పార్క్ కు  కెసిఆర్  శంకుస్థాపన

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఈ నెల్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.  ఈ సందర్భంగా  భారీ బహిరంగ  సభ  నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సభ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులతో సర్క్యూట్ గెస్ట్ హౌసులో సమావేశమయ్యారు. సభకు వచ్చే వాహనాలకు రూట్లు, పార్కింగ్ సదుపాయాలు, విఐపిల వసతులు, సభా వేదిక రూపకల్పన, సభకు తరలివచ్చే జనాలకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, టాయిలెట్స్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. భారీ ఎత్తున జనాలు రానున్న సందర్భంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సభా వేదిక వరకు చేరుకునేలా అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సీపీ సుధీర్ బాబు, వరంగల్ కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రశాంత్ జీవన్ పాటిల్, జీ డబ్ల్యూ ఎంసీ కమిషనర్ శ్రుతి ఓజా, ఆర్డీఓ మహేందర్, మమునూర్ ఏసీపీ శోభన్, ఇతర అధికారులు హాజరయ్యారు.

 

loader