నకిలీ సర్టిఫికెట్ల  ముఠాను అరెస్ట్ చేసిన నార్త్ జోన్  పోలీసులు  మూడో టెస్టులోను టీం ఇండియా విజయం పాకిస్థాన్ లో పర్యటించనున్న శ్రీలంక జట్టు షియా వక్ప్ బోర్డు నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎంఐఎం అదినేత అసదుద్దిన్ ఒవైసి వినాయక చవితి ఉత్సవాల  ఏర్పాట్లను పర్యవేక్షించిన మేయర్ బొంతు రామ్మోహన్‌ 

 పార్టీ పెడతానని వస్తున్న వార్తలన్ని అబద్దాలే

ప్రజాగాయకుడు గద్దర్ కొత్త పార్టీ పెడ‌తార‌ని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెడుతున్నానని వస్తున్న వార్త‌ల‌ను కొట్టిపారేశారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని తేల్చి చెప్పిన ఆయన, తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌ను, ప్రజా సంఘాలను ఐక్యం చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో నిర్వహించిన తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్య వేదిక ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆయన ఈ విషయాలను మీడియాకు తెలిపారు.

చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్ లు

హైదరాబాద్: నగరంలో వినాయక చవితి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి బేబీ పాండ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రాయదుర్గం మల్కం చెరువులో నిర్మించిన బేబీ పాండ్‌ను పరిశీలించారు. ఇప్పటి వరకు 10 బేబీ పాండ్స్‌ను నిర్మించామని, త్వరలో మరో 15 బేబీ పాండ్స్‌ను నిర్మించనున్నట్లు మేయర్‌ తెలిపారు.

అయోద్య విషయంలో తగ్గేదే లేదు

అయోద్య వివాదంలో పట్టువిడుపు ప్రదర్శించాలన్న షియా వక్ప్ బోర్డు నిర్ణయాన్ని ఎంఐఎం అదినేత అసదుద్దిన్ ఒవైసి తప్పుపట్టారు. మత పెద్దలు చెప్పినంత మాత్రాన మసీదులను వదుకోలేమన్నారు. వారు మత భోదకులు మాత్రమేనని, మత పరమైన ఆస్తులకు వారు యజమానులు కారని ఆయన సూచించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి దూరంగా, ముస్లింలు ఉండే చోట మసీదు నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని షియా సెంటర్ వక్ఫ్ బోర్డు ప్రకటించడాన్ని ఒవైసీ తోసిపుచ్చారు. ముస్లింల వారసత్వ ఆస్తులను దానం చేయడానికి మౌలీలకు అధికారాలెవరిచ్చారని ఆయన మండిపడ్డారు. 

అవార్డులను అందుకోనున్న అధికారులు 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించింది. ప్రెసిడెన్షియల్ మెడల్ అవార్డులు, తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపికైన పోలీసులు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగ అవార్డులను స్వీకరించనున్నారు.
అంజని కుమార్, రాజీవ్ రతన్, సూర్యనారాయణ, శివప్రసాద్ ఐపీఎస్ లకు ప్రెసిడెన్షియల్ మెడల్ అవార్డులను, సీవీ ఆనంద్, ప్రవీణ్ కుమార్,వాకాటి కరుణ,షఫిఉల్లా, శ్రీకాంత్ లకు తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

"భరత్ అనే నేను'' సినిమా ప్రారంభం

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం మరో క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఇవాళ ప్రారంభమయింది. 'భ‌ర‌త్ అనే నేను' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఇవాళ జరిగిన పూజా కార్య‌క్ర‌మాలకు మహేష్ హాజరుకాలేకపోయాడు.అయితే ఆయన కుటుంబం మొత్తం పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేశ్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్, దేవిశ్రీ ప్ర‌సాద్, దిల్ రాజు, అశ్వనీద‌త్, రాఘ‌వేంద్ర‌రావు, వీవీవినాయ‌క్, వంశీ పైడిప‌ల్లి, గౌత‌మ్, సితార త‌దిత‌రులు పాల్గొన్నారు.

పాకిస్థాన్ పర్యటనకు లంక సిద్దం 

ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఓ విదేశీ జట్టు పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటానికి అంగీకారం తెలిపింది. శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ లో పర్యటించడానికి భయపడుతున్నాయి. అయితే ఇపుడు అదే శ్రీలంక జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు అంగీకరించింది. పాకిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు శ్రీలంక క్రికెట్ చీఫ్ తిలంగ సుమ‌తిపాల తెలిపారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు శ్రీలంక క్రకెట్ బోర్డ్ తెలిపింది.

మట్టి గణనాథులే పర్యావరణానికి మేలు 

వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న జీహెచ్ ఎంసీ, మాటల్లోనే కాదు చేతల్లోను దాన్ని నిజం చేయడానికి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను నగర వ్యాప్తంగా పంచనుంది. వాటిని తయారు చేస్తున్న నార్సింగ్ లోని మట్టి విగ్రహాల తయారి కేంద్రాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించారు. ఆయనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ప్రాణాలు తీసిన మద్యం మత్తు

కరీంనగర్ : జమ్మికుoట పట్టణంలో దారుణం జరిగింది. మద్యంమత్తు లో ఇద్దరు అన్నదమ్ముల మద్య చిన్నగా మొదలైన గొడవ చివరకు ప్రాణాలు తీసుకునే స్థాయికి పెరిగింది. మద్యం మత్తులో సంజీవ్ అనే యువకుడు గొడ్డలి తొ తమ్ముడు మధుపై దాడి చేసాడు. దీంతో మధు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, నిందితుడు సంజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తనయుడి మృతి​


నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ తనయుడు డాక్టర్ విజయ్ కుమార్ తో పాటు, ఆయన బార్య మృతి చెందారు. జిల్లాలోని కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం బస్టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతిచెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఘటనాస్థలికి చేరుకుని సహయకచర్యలను పర్యవేక్షించారు.

సుందిళ్ళ భూనిర్వాసితుల ఆందోళన

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలో కొనసాగుతున్న సుందిళ్ళ బ్యారేజ్ పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ భూముల ధరలకు, తమకు ఇచ్చిన పరిహారానికి అసలు పొంతనే లేదని వారు ఆగ్రహించారు. కనీసం పక్క గ్రామం గోలివాడ లో ఇచ్చినట్లు ఎకరాకు 13 లక్షల నష్టపరిహారమైనా ఇవ్వాలని నిర్వాసిత రైతుల డిమాండ్ చేశారు.

చరిత్ర సృష్టించిన టీం ఇండియా

విదేశీ గడ్డపై భారత జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. 3 టెస్టుల ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై అతిపెద్ద విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 135 ప‌రుగులకే ఆలౌటైన లంక‌, రెండో ఇన్నింగ్స్‌లో 181 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. మొత్తానికి భారత జట్టు నిర్దేశించిన 487 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక చతికిలపడింది ఆతిథ్య లంక జట్టు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4, ష‌మి 3, ఉమేష్ యాద‌వ్ 2 వికెట్లు తీసుకుని విజయంలో కీలకంగా వ్యవహరించారు. 

నకిలీ దృవపత్రాల ముఠా గుట్టు రట్టు 

హైదరాబాద్ : నగరంలో నకిలీ సర్టిఫికెట్లను ముద్రిస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ పరిధితో కార్యకలాపాలు కొనసాగిస్తున్న 5 గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా టెన్త్,ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ సంబందించిన నకిలీ దృవపత్రాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వీరి వద్ద నుంచి నకిలీ ధ్రువ పత్రాలు, వివిధ యూనివర్సిటీ లకు చెందిన 170 స్టాంపులు, ప్రింటర్లు, కప్యూటర్లు సీజ్ చేసారు. పట్టుబడిన వారిలో ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ లు ఉన్నట్లు సమాచారం.

మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ ముఠా పట్టుబడింది. ఈ ముఠాలో ఒక నైజీరియన్ తో పాటు, ముగ్గురు స్థానికులు ఉన్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పట్టుబడ్డ వారంతా డ్రగ్ సరపరాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు రాచకొండ సీపి తెలిపారు.
పట్టుబడిన అజం గాబ్రిల్, నూక నవ్యత్, అంకిత్, బొల్లారెడ్డి లను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పవన్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా దగ్గరి నుంచి కొకైన్, ఎంపీటమిన్ పిల్స్ 450, ఎండీఎంఏ 45 గ్రామ్స్, ఐఎస్డీ 60 స్టిఫ్స్ ని రికవరీ చేశారు. వీటిని గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా వీరు పట్టుబడినట్లు సీపి తెలిపారు.

కాపులకు రిజర్వేషన్లు అందించేది తెలుగుదేశం ప్రభుత్వమే

కాపులను బిసీల్లో చేర్చడమనేది తెలుగుదేశం ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదే ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, కాపుల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక వ్యక్తి ఆయనే అని చినరాజప్ప కితాబిచ్చారు. కొందరు స్వలాభం కోసం కాపులను రెచ్చగొడుతున్నారని పరోక్షంగా ముద్రగడ, జగన్ లపై విరుచుకుపడ్డారు చినరాజప్ప.

మియాపూర్ లో కలకలం రేపిన పేలుళ్లు 

మియాపూర్ మెట్రో డిపో సమీపంలో భారీ శబ్దంతో పేలుడు పధార్థాలు విస్పోటనం చెందాయి. జనావాసాల సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డంపింగ్ యార్డు ప్రాంతంలో పేలుడు జరగడంతో ప్రమాదంలో ఎవరికి అపాయం సంభవించలేదు. పేలుడు సమయంలో అక్కడే గడ్డి మేస్తున్న ఓ గేదె తల తెగిపడింది. సంఘటన స్థలానికి చేరుకున్నమియాపూర్ సీఐ హరిశ్చంద్రారెడ్డి పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. 

విలేకరులపై సమంత బౌన్సర్ల దాడి

ఎల్బినగర్ ఎల్పీటి మార్కెట్ కమిటీ సభ్యులు మీడియా సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దసరా, దీపావళి బంఫర్ ఆఫర్స్ ఓపెనింగ్ లో పాల్గొన్న హీరోయిన్ సమంత ప్రోగ్రాంను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై దాడి చేశారు.దీంతో వారు ఆందోళనకు దిగారు.
అయితే ఆందోళనకు దిగిన రిపోర్టర్లను కమిటీ సభ్యులు నిర్బంధించారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్, కెమెరాలను సమంత బౌన్సర్స్ లాక్కున్నారు. మీడియా సిబ్బందిని బలవంతంగా అక్కడినుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

గవర్నర్ తో ముగిసిన అఖిలపక్షం భేటి

పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గవర్నర్ నరసింహన్ తో జరిగిన భేటీ ముగిసింది. నేరెళ్ల లో ఇసుక మాఫియా ఆగడాలు, వాటిని అడ్డుకున్న దళితులపై పోలీసుల అమానుష దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై వారు గవర్నర్ కు పిర్యాదు చేసారు. గవర్నర్ ను కలిసినవారిలో బిజెపి అద్యక్షులు లక్ష్మణ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, పిఎల్ విశ్వేశ్వర్ రావు, చాడా వెంకట్ రెడ్డి ,మోత్కుపల్లి నర్సిములు, రమణ తదితరులు ఉన్నారు. 
ఈ సంధర్బంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగిందన్న నేతలు, దీనిపై ప్రభుత్వ వివరణ కోరాలని గవర్నర్ కు సూచించారు. దళితులను వేదించిన ఎస్పీ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అక్కడి నుంచి సమాధానం తేదని, దీనిపై మీరు దృష్టి సారించాలని వారు గవర్నర్ కు తెలిపారు.

విజయవాడలో జనసేన ర్యాలీ

విజయవాడలో జనసేన కార్యకర్త పోతిన మహేష్ ఆధ్వర్యంలో 400అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ తీశారు. దేశరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి. విదేశీ వస్తువులను బహిష్కరించాలని,దేశంలో లౌకికతత్వాన్ని కాపాడాలని, దేశ సంపదను విదేశాలకు తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించారు.

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ లో రేపు ట్రాపిక్ ఆంక్షలు విధించినట్లు సీపి మహెందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా గోల్కొండలో వేడుకలు చేపడుతున్నందున ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్ మళ్లింపులు,ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు రాందేవ్ గూడ వైపున్న గోల్కొండ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
 అలాగే సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే తేనేటి విందు సందర్భంగా రాజ్‌భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. 

అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్ : హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు లో భూధాన్ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నేడు సిద్దిపేటలో పర్యటించనున్న మంత్రి హరిష్ రావు 

నేడు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో మంత్రి హరిష్ రావు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం హుస్నాబాద్ బస్ స్టాండ్ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. అలాగే రవాణా శాఖ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. హరిష్ రావుతో పాటు మరో మంత్రి మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గవర్నర్ ను కలవనున్న అఖిలపక్షం నేతలు

నేరెళ్ల ఘటనపై విచారణను వేగవంతం చేయాలని, దీనికి భాద్యులైన పోలీసు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అఖిల పక్షం నేతలు నేడు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. నేరెళ్ల లో దళితలపై జరిగిన దాడిలో వారికి అండగా నిలబడి, ప్రభుత్వం వారికి న్యాయం చేసేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరనున్నారు. 

నేడు ఆరో రోజుకు చేరిన జగన్ నంద్యాల క్యాంపెయిన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. ఆరో రోజున ఆయన పద్మావతి నగర్‌, మార్కెట్‌ యార్డ్‌, ఎస్‌బీఐ కాలనీ, గంగుల ప్రభాకర్‌ రెడ్డి సెంటర్‌, చంద్రశేఖర్‌ టాకీస్‌ మీదుగా ఆయన రోడ్‌ షో సాగనుంది. అనంతరం సుద్దులుపేట, గిరినాథ్‌ సెంటర్, గోపాల్‌నగర్, పీపీనాగిరెడ్డి సెంటర్‌, విశ్వనగర్‌, నవర్తినగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, లలితా నగర్‌, పొన్నాపురం కాలనీలో వైఎస్‌ జగన్‌ రోడ్ షోలు నిర్వహిస్తారు. 

పెరిగిన పెట్రోల్ ధర.. డీజిల్ ధర పెరగలేదు

కొద్దిరోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు మాత్రం పెట్రోలు ధర పెరగగా, డీజిల్ ధరలో మాత్రం మార్పు రాలేదు. తాజా సమీక్షతో పెట్రోలుపై 21 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ పాత ధర రూ.71.74 ఉండగా, కొత్త ధర రూ.71.95కు చేరింది. రూ. 61.90 ఉన్న డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.