ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

asianet telugu express news  Andhra Pradesh Telangana
Highlights

  • పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్టల్‌ను   ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య 
  • జై లవకుశ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
  • ర‌క్షాబంధ‌న్  వేడుక‌ల‌పై తనదైన శైలిలో ట్వీట్ చేసిన సెహ్వాగ్
  • పొన్నం ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • షూటింగ్ లో గాయపడ్డ తమిళ హీరో విశాల్ 
  • పవన్‌ కల్యాణ్‌  చేనేత కార్మికులకోసం చేసిందేమిటో చెప్పాలన్న వైసీపి ఎమ్మెల్యే రోజా 

జనసేనానిపై విరుచుకుపడ్డ రోజా

చేనేత ప్రచారకర్తగా ఉన్న పవన్‌ కల్యాణ్‌  చేనేత కార్మికులకోసం ఏం చేస్తున్నారో చెప్పాలని వైసీపి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. మంగళగిరిలో వైసీపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి చేనేత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన రోజా పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. కేవలం సినిమాల ప్రచారానికే ఆయన చేనేతను వాడుకుంటున్నారని విమర్శించారు.  జీఎస్టీ పన్న విధానం వల్ల చేనేత రంగం నష్టపోతుంటే జనసేనానిగా చెప్పకునే  పవన్‌ ఎందుకు స్పందించటం లేదని రోజా ప్రశ్నించారు.  
 

షూటింగ్ లో గాయపడ్డ తమిళ్ స్టార్ విశాల్

తమిళ్ హీరో విశాల్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో అదుపుతప్పి కింద పడ్డాడు. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ తరలించి వైద్య చికిత్స అందించారు. అయితే ఆయనకు తగిలినవి చిన్న గాయాలేనని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని సినిమి యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆయన మిష్కిన్‌ డైరెక్షన్ లో  ‘తుప్పరివాలన్’  అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు.  
 

పొన్నం దీక్షకు సంఘీభావం తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్ లో మెడికల్ కాలేజే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ను ఏవిధంగా అయితే సాధించుకున్నాయో,అదే మాదిరిగా కరీంనగర్ మెడికల్ కాలేజిని కూడా సాధించుకుంటామని ఉత్తమ్ తెలిపారు. అందుకోసం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ వెంట జిల్లా ప్రజలంతా ఉన్నారని సీఎం గుర్తుంచుకోవాలన్నారు ఉత్తమ్.
 

హిమాచల్‌ ప్రదేశ్‌ లో బీజేపి గెలుపు అసాధ్యం - వీరభద్రసింగ్ 

ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌  బీజేపి చేపట్టిన  ‘మిషన్‌ 60 ప్లస్‌’ ప్రచార కార్యక్రమంపై  ముఖ్యమంత్రి  వీరభద్రసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భీజేపి 60 సీట్లు గనుక గెలిస్తే తాను రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతానన్నారు. ఈ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాంగ్రెస్  ఐక్యమత్యంతో ముందుకు వెడుతోందన్నారు. 68 అసెంబ్లీ సీట్లు  మాత్రమే ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ లో భీజేపి 60 సీట్లు గెలుస్తామనడం వారి అహంభావానికి నిదర్శమని  వీరభద్రసింగ్‌  విమర్శించారు.  
 

తన బట్టతలపై తానే కామెంట్ చేసుకున్న సెహ్వాగ్ 

ట్విట్టర్ వీరుడు వీరేంద్ర సెహ్వాగ్  ర‌క్షాబంధ‌న్  వేడుక‌ల‌పై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.   త‌న ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు రాఖీ కట్టిన  ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి త‌న‌దైన స్టైల్ కామెంట్ చేశాడు. నా సోద‌రీమ‌ణులు అంజు జీ, మంజు జీ.. నేను హాఫ్ గంజు జీ అంటూ వీరూ కామెంట్ చేశాడు.  అంటే తన చెల్లెళ్ల పేర్లు చెబుతూ వారితో పాటున్న తాను అరగుండు (బట్టతల)గాన్నని  తనపై తానే కామెంట్ చేసుకున్నాడు.అలాగే అందరికి ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు  ఒకదానికొకటి డీకోని ప్రమాదం జరిగింది. వలిగొండ మండలం నాతేళ్ళగుడెం వద్ద  జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగకున్నా, ఇద్దరి పరిస్థితి మాత్రం విషయంగా ఉంది. ఇరవై మందికి తీవ్రగాయాలవగా  భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు బస్సులు కూడా భువనగిరి నుండి నల్గొండ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 

పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులు  

రాఖీ పండగ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న  ‘జైలవకుశ’ సినిమాలోని ‘లవ’ క్యారెక్టర్ కి సంభందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది సినీ బృందం. ఈ లుక్ చూస్తే ఆయన కూల్ గా,మరియు క్లాస్ గా కనబడుతున్నాడు . ఇప్పటికే జై క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా,ఇప్పుడు లవ క్యారెక్టర్ పస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలను పెంచింది సినీ బృందం. 
 

శ్రీశాంత్ పై  నిషేదాన్ని  ఎత్తివేసిన కేరళ హైకోర్టు

క్రికెటర్ శ్రీశాంత్ పై  బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.  స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయనపై విధించిన నిషేదాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు  హైకోర్టు తెలిపింది. శ్రీశాంత్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తుది తీర్పును వెలువరించిన ఉన్నత న్యాయస్థానం, బీసీసీఐ  క్రమశిక్షణా కమిటీ ఈ ఆదేశాలను పాటించాలని తెలిపింది.
 

భూమా బ్రహ్మానందరెడ్డిపై  వైసీపి ఫిర్యాదు

నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై  వైసీపి నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బ్రహ్మానందరెడ్డి  పాటించడంలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కన్నారు.  ఎన్నికల అఫిడవిట్‌లో బ్రహ్మానందరెడ్డి  ఆదాయపన్ను వివరాలను చూపించలేదని  వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పిర్యాదులో పేర్కొన్నారు.  ఎన్నికల కోడ్‌కు ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారిని విన్నవించారు.
 

కృష్ణా జిల్లాలో కారు - ఆర్టీసి బస్సు ఢీ, ముగ్గురు మృతి


కృష్ణా జిల్లా చల్లపల్లి కృష్ణ కరకట్ట మీద కారు-అర్ టి సి బస్స్ ఢీ కొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారులో మొత్తం నలుగురున్నారు. నాలుగో వ్యక్తికి  తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కృష్ణా జిల్లా నిడుమోలు గ్రామస్తుల గా గుర్తించారు.                        
విజయవాడ నుండి నిడుమోలుకు కారులో వెళ్తుండగా చల్లపల్లి సమీపంలో ఎదురుగావచ్చిన  అర్ టి సి బస్సు వేగంగా  ఢీకోట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారశైలి బాగాలేదు - రామ్ గోపాల్ వర్మ

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి రామ్ గోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. డ్రగ్స్ కేసులో  సినీ పరిశ్రమకు  తలవంపులు తెచ్చేలా ఫిల్మ్ ఛాంబర్ వ్యహరిస్తోందని వర్మ మండిపడ్డారు.   "అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం" అని అంటున్న ఫిల్మ్ ఛాంబర్ ఆ కొద్ది మంది ఎవరో చెప్పాలన్నారు. ఈ కేసులో అభియోగం ఎదుర్కుంటున్న వారి తప్పు లేదని తెలిస్తే ఫిల్మ్ ఛాంబర్  వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ  చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్దే  నా లక్ష్యం - వెంకయ్య

తాను ఏ స్థానంలో ఉన్నా ఆంద్రప్రదేశ్ అభివృద్దిని తన వంతు కృషి చేస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఏపికి మంచి భవిష్యత్ ఉందన్నారు.   తిరుపతిలో  టీటీడీ  రూ. 18 కోట్లతో నిర్మించిన పద్మావతి మెడికల్ కాలేజీ హాస్టల్‌ను  ఆయన ప్రారంభించారు. 
 

బ్రెయిన్ హేమరేజ్ తో జర్నలిస్ట్ యాదా రమేష్ మృతి  

 

తెలుగు జర్నలిజానికి విశేష సేవలు అందించిన యాదా రమేష్ బ్రెయిన్ హామరేజ్ తో మరణించారు. గత కొన్ని రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు చివరి శ్వాస విడిచారు. ఆయన మరణం తమకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నట్లు సాటి జర్నలిస్టులు  తెలిపారు. ప్రస్తుతం ఆయన నమస్తే తెలంగాణ దినపత్రికలో పనిచేస్తున్నారు. గతంలో ఆయన సాక్షి, తులసి ఛానల్లలో పని చేశారు. 

రజనీకాంత్ ను కలిసిన బీజేపి ఎంపీ పూనమ్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను బీజేపీ ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్ కలవడం తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  తమిళనాడు పర్యటనలో ఉన్న పూనమ్ ఆకస్మికంగా ర‌జ‌నీ నివాసానికి చేరుకుని ఆయ‌నతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని పూన‌మ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అయితే ఈ స‌మావేశానికి రాజ‌కీయంగా ఎలాంటి  ప్రాముఖ్య‌త లేద‌ని పూనమ్ తెలిపారు.  
 

ముద్రగడతో బొత్స సత్యనారాయణ భేటి

కాపు ఉద్యమ నేత  ముద్రగడ పద్మనాభం తో  వైసీపి నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.  ముద్రగడ నివాసంలో జరిగిన ఈ బేటీలో కాపులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షను వారు తప్పుబట్టారు. ఈ సందర్బంగా  బొత్స మాట్లాడుతూ  కాపులనేతలను పోలీసులు మాటి మాటికి అరెస్టులకు పాల్పడటం తగదన్నారు. చంద్రబాబు కాపు ఉద్యమంపై  ఉక్కుపాదం  మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చంద్రబాబు కాపులను వేదించడం ఆపాలని , వారిని ఆదుకోవాల్సిన భాద్యత సీఎంపై ఉందని బొత్స  తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం


మైనారిటీ, బీసి B మరియు C కేటగిరిలో మెడికల్ సీట్ల  ఫీజులను పెంచిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 115,117,119  లపై హైకోర్టు స్టే విధించింది. గతంలో జారీ చేసిన  జీవో 130 ప్రకారమే సీట్లను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సంవత్సరానికి 11 లక్షల నుండి 14 లక్షలకు ప్రభుత్వం ఫీజులు పెంచినట్లు,   దీనివలన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ పెంపు జీవోను రద్దు చేసింది.
 

లష్కరే తోయిబా ఉగ్రవాది ఉమర్ హతం

జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది   ఉమర్‌ హతమయ్యాడు. సరిహద్దులో గల సంబూరా ప్రాంతంనుంచి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను  గస్తీ  బలగాలు గుర్తించాయి.  ముష్కరులు కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులకు దిగారు. దీంట్లో మరణించిన ఉగ్రవాది ఉమర్ కు అనేక నేరాలతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  సంఘటనాస్థలం నుంచి ఏకే 47 రైఫిల్‌ స్వాధీనం చేసుకున్నారు. 
 

జగన్ పై డిజిపికి పిర్యాదు చేసిన విజయవాడ నేతలు

 

ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజయవాడ టీడిపి నేతలు డీజిపి సాంబశివరావుకు పిర్యాదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై వెంటనే చార్జిషీట్ ఓపెన్ చేయాలని వారు డిజిపికి విన్నవించారు. ఇప్పటికే ఎన్నికల కమీషన్ కు  దీనిపై పిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.   
 

సచివాలయంలో రాఖీ పండగను జరుపుకున్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సచివాలయంలో  లోకేష్ కు పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు. ఈ సంధర్బంగా ఆయన మహిళలకు స్వీట్లు పంచారు. 
 

వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే రోజా

 

రాఖీ పండగను పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా  ప్రతిపక్ష నాయకుడు జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.  ఏపీ ప్రజలందరు అన్నగా పిలుచుకునే జగనన్నకు రాఖీ కట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు రోజా. ప్రజలందరు ఈ రాఖీ పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, వారందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.  

  రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రక్షాభందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.  అన్న చెల్లెళ్ల అనుభందాన్ని రెట్టింపుచేసేదే రాఖీ పండుగ. అలాంటి ప్రేమ, ఆప్యాయత ల పండుగను దేశ ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.   దేశ పౌరులందరిలో సోదరభావం నెలకొనాలని ఆశిస్తున్నానని కోవింద్‌ తన సందేశంలో తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

 ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో మొదటిసారి తిరుమ‌లకు చేరుకున్న వెంక‌య్య‌నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు.  తిరుమ‌ల‌కు చేరుకున్న  వెంకయ్యకు టీటీడీ ఉన్నతాధికారులు  స్వాగ‌తం ప‌లికారు.  కుటుంబ స‌మేతంగా తిరుమలకు  వచ్చిన ఆయన పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. తెల్ల‌వారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో  వెంకటేశ్వర స్వామిని  ద‌ర్శించుకున్నారు. వెంకన్న ద‌ర్శ‌నం అనంతరం ఆయనకు టీటీడి అధికారులు   తీర్థప్రసాదాలు అందించారు.  

కవిత రాఖీ పండగ సందేశం

 

 

తమిళ‘బిగ్‌బాస్‌’కు నిరసన

 

చెన్నై: కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న తమిళ ‘బిగ్‌బాస్‌’ రియాల్టి షోకు వ్యతిరేకత మొదలయింది. ఆదివారం నాడు కొంతమంది షోని బంద్ చేయాలని ఆందోళన చేశారు. నేతాజీ సుభాష్‌ షెనాయ్‌ సంస్థ అధ్యక్షుడు మహరాజన్‌ నేతృత్వంలో దాదాపు 40మంది ఆందోళనకారులు ఆదివారం ఉదయం పూనమలి లోని బిగ్‌బాస్‌ స్టూడియో వద్ద గుమికూడి  షోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు సంప్రదాయాలను మంటగలిపేలా ఈ షో నిర్వహణ ఉందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్టూడియో లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు.  అపుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం బంద్

 

చంద్రగ్రహణం కారణంగా  ఈ రోజు  తిరుమల శ్రీవారి ఆలయం సాయంత్రం 4 గంటలకే మూతపడనుంది.తిరిగి మంగళవారం వేకువజామున ఆలయాన్ని తెరవనున్నారు.గ్రహణం కారణంగా ఆలయం మూతపడుతుండటంతో నడకదారి భక్తులకు కేవలం 6 వేల టోకెన్లు మాత్రమే మంజూరు చేస్తున్నామని టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు చెప్పారు. 
ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకూ వరుస సెలవుల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రముఖ రచయిత పోతుకూచి మృతి

​హైదరాబాద్:  ప్రముఖ రచయిత పోతుకూచి సాంబశివరావు ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1927 జనవరి 27న జన్మించారు.  కథా రచయితగా, నవలారచయితగా, పద్యకవి, వచనకవిగా ఎన్నో రచనలు చేశారు.

 ఆయన స్వయంగా నటుడు, నాటక కర్త కూడా. సాంబశివరావు రచించిన ‘హంతకులు’ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ నాటకంగా ఎంపిక చేసింది. పల్లె కదిలింది నాటకం, దొంగ-దొర, ప్రతిధ్వనులు, పెళ్లి పిలుపు తదితర ఎన్నో నాటకాలుజనాదరణ పొందాయి.

రాసి-సిరా, అనురాగం-అను-రాగం, సాంబ శివానంద లహరి, పోతుకూచీయం, శిఖరాలు, అగ్నినాదాలు, చైతన్య కిరణాలు వంటి కవితా సంపుటాలు పదికి పైగా వెలువరించారు. నవ్యసాహితీ సమితి, ఆంధ్రవిశ్వసాహితి అనే సంస్థలను నెలకొల్పారు.

అఖిల భారత తెలుగు రచయితల మహాసభలను తొలిసారిగా 1960లో హైదరాబాద్‌లోనూ, 1963లో రాజమండ్రిలోనూ, 1967లో తిరుపతి, 1969, 1971లో మళ్లీ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఘనత సాంబశివరావుకు దక్కింది. దక్కన్‌క్రానికల్ ఆంగ్ల దినపత్రికలో ‘ది తెలుగు వరల్డ్’ శీర్షికతో తెలుగు సంస్కృతి సాహిత్యాలపై అనేక వ్యాసాలు రాశారు.

ముఖ్యమంత్రి సంతాపం

రచయిత, కవి, నాటకకర్త, అనువాదకుడు పోతుకూచి సాంబశివరావు మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

అనేక సాహిత్య సంస్థలలో క్రియాశీలంగా ఉండి, మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులలో ముఖ్య భూమిక పోషించిన పోతుకుచి మరణం సాహిత్యలోకానికి తీరని లోటుగా చంద్రబాబు అన్నారు.

ప్రతి సోమవారం ప్రభుత్వోద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలి

 

విజయవాడ: ప్రతిసోమవారం నాడు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది.  ఈ విషయాన్ని  రాష్ట్ర కార్మిక మంత్రి అచ్చన్నాయుడు వెల్లడించారు. సోమవారం  నాడు ఆయన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించారు. చేనేత రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని చేనేత కార్మికుల ను అన్ని విధాల ఆదుకుని, మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించారు.ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు అంతా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించామని వెల్లడించారు.చేనేత వస్త్రాల పై ప్రజల్లో కూడా అవగాహన కల్పించేలా ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పారు.

విజయవాడ ఎటిఎం దొంగల ఆచూకి చెబితే రు.25 వేల నజరానా‌

 

కోన్ని రోజులక్రితం కొంత మంది యువకులు విజయవాడ నగరంలోని భవానీ పురం క్రాంబే రోడ్డులో ఎ టి యం లో కి ప్రవేశించి విషన్ ఒపెన్ చేసి నగదును దోంగిలించారు.ఇదంతా అక్కడ ఉన్న సి సి టివి లో రికార్డు అయ్యింది.కాని ఇప్పటివరకు దోంగలు దొరకలేదు. పలు బృందాలుగా పోలీసులు ఎర్పడి గాలింపు చర్యలు చెపట్టి‌నా ఉపమోగంలేకపోవటంతో ఈ రోజు నగర డి సి పి క్రాంతిరానా టాటా అనుమానితుల ఫోటోలను రిలీజ్ చేశారు. దొంగల ఆచూకి తెలిస్తే నేరుగా డి సి పి కి ఫోన్ చెయ్యవచ్చని చెప్పారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నిందుతుల అచూకి తెలిపిన వారికి రు. 25000నజరానా ప్రకటించారు. పోలిసులు తో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చెయ్యటానికి ఈ నజరానా ప్రకటించినట్లు తెలిపారు. ఇటీవల ప్రజల నుండి చాలా మైన ముఖ్యసమాచారం పోలిసులు కి వచ్చిందని దాని వల్లన మాకు కేసులు ఛేదించటం ఈజీగా ఉంటుందన్నారు

 

 

 

loader