కడ‌ప ఉక్కు కోసం మార్చ్‌ఫాస్ట్

asianet telugu crime column  police investigation court cases
Highlights

నేటి విశేషాలు

  • కడపస్టీల్ ప్లాంట్ కోసం మార్చ్ ఫాస్ట్ కు సన్నద్ధమవుతున్న జిల్లాయువత
  • జైలులో డేరా బాబా అవస్థలు, ఉరితీయమంటూ వేడికోలు 
  • పరిటాల పెళ్లి ఏర్పాట్ల లో విషాదం, ఇద్దరు మృతి
  • బంద్ పాటిస్తున్న తెలంగాణ ట్రయల్ కోర్టులు
  • ప్రొద్దుటూరులో విద్యార్థికి కఠిన శిక్ష విధించిన టీచర్

  కడ‌ప ఉక్కు కోసం మార్చ్‌ఫాస్ట్ 

వేలాది మందితో మార్చ్‌పాస్ట్‌కు ప్ర‌చారం

ప్రారంభించిన స్టీల్ ప్లాంటు సాధ‌నాస‌మితి 

క‌డప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న కోసం  స్టీల్ ప్లాంటు ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తున్న‌ట్లు స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితిఅధ్య‌క్షులు జీవి. ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. స్టీల్ ప్లాంటు సాధ‌న కోసం రాయ‌ల‌సీమ విద్యార్థి గ‌ర్జ‌న కార్య‌క్ర‌మాన్ని క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని దీప్తి జూనియ‌ర్ కాలేజీలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ క‌డ‌పలో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు చేయాల‌ని అనేక ఉద్య‌మాలు చేస్తున్నాప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. విభ‌జ చ‌ట్టంలో పేర్కొన్న స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు మూడేళ్ళ నుంచి ప్ర‌భుత్వాలు తీసుకున్న చ‌ర్య‌లు ఒక్క‌టికూడా లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో మార్చ్‌ఫాస్ట్ ఫార్ స్టీల్ ప్లాంటు పేరుతో భారీ ఉద్య‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 110 గంట‌ల నిరాహార దీక్ష చేసినా, వేలాది మంది విద్యార్ధుల‌తో నిర‌స‌న నిర్వ‌హించినా, శాంతియుత మార్గంలో ఉక్కు ఆకాంక్ష‌ల‌ను ప్ర‌భుత్వాల ముందు ఉంచినా చ‌లించ‌డం లేద‌న్నారు. తెలంగాణా స్ఫూర్తితో మార్ఛ్ ఫాస్ట్‌ను పూనుకున్న‌ట్లు చెప్పారు. ఈ ఉద్య‌మంలో విద్యార్థులే కాకుండా వారి త‌ల్లిదండ్రులు సామాన్య జ‌నం కూడా పాలు పంచుకునేలా ఇంటింటికీ ఉక్కు ఉద్య‌మం కార్య‌క్ర‌మాన్ని చేపట్టి ఉద్య‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితి నాయ‌కులు అమ‌ర్‌నాథ్‌రెడ్డి, ఎన్‌.ఎస్‌. ఖ‌లంద‌ర్‌, దీప్తి కాలేజీ ప్రిన్సిపాల్ సుద‌ర్శ‌న్‌రెడ్డి, శ్రీ‌నివాస్ క‌ళాబృందం పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

 

పాతపెన్షన్ విధానం కోసం తెలంగాణ ధర్నా

మేడ్చల్ జిల్లా  మేడిపల్లి మండలం పీర్జాదిగూడ లో సిపియస్ రద్దు చేయాలనీ ,  పాత పెన్షన్  విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపియస్ ప్రభుత్వ ఉపాధ్యాయ , ప్రభుత్వ ఉద్యోగ సంఘం - టీఎస్ ఆధ్వర్యంలో మహధర్నా నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, టీ - జెఏసి ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ధర్నాకు హాజరయి మద్దతు తెలిపారు.

  విజయవాడ చైన్ దొంగల అరెస్టు

కృష్ణా జిల్లాలో వరుస గొలుసు దొంగ తనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వీరి నుండి  15కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయవాడ వరస చైన్  దొొంగతనాలలతో అట్టుడికి పోయింది.

  సంతానం కోసం కోడిముద్దలు

నెల్లూరు జిల్లా,చిట్టమూరు మండలం మల్లాంలోని స్వయంభు  శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి బ్రమోతస్స్వాల్లో  బాగంగా ధ్వజారోహణ కార్యక్రమం,పూజలు ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా సంతానం లేనివారికి కోడిముద్ద (అన్నము ముద్ద ) ప్రసాదం గా స్వీకరిస్తే  పిల్లలు పుడతారని నమ్మకంతో 200మందికి పైగా దంపతులు  ఈ కోదిముద్దలు స్వేకరించారు. ఆలయ చైర్మన్ పపారెడ్డి వెంకటసుబ్బా రెడ్డి,EO రమణారెడ్డి,ZPTC భారతమ్మ ,కమిటీ సభ్యులు, ఆలయ ప్రదాన అర్చకులు భానుప్రకాష్ శర్మ ఏర్పాట్లు పర్యవేక్షించారునెల్లూరు జిల్లా,చిట్టమూరు మండలం మల్లాంలోని స్వయంభు  శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి బ్రమోతస్స్వాల్లో  బాగంగా ధ్వజారోహణ కార్యక్రమం,పూజలు ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా సంతానం లేనివారికి కోడిముద్ద (అన్నము ముద్ద ) ప్రసాదం గా స్వీకరిస్తే  పిల్లలు పుడతారని నమ్మకంతో 200మందికి పైగా దంపతులు  ఈ కోదిముద్దలు స్వేకరించారు. ఆలయ చైర్మన్ పపారెడ్డి వెంకటసుబ్బా రెడ్డి,EO రమణారెడ్డి,ZPTC భారతమ్మ ,కమిటీ సభ్యులు, ఆలయ ప్రదాన అర్చకులు భానుప్రకాష్ శర్మ ఏర్పాట్లు పర్యవేక్షించారు

  దేవుడా, ఏమిరా కష్టాలు....నన్ను ఉరి తీసి చంపేయండి

మేరా క్యా క‌సూర్ హై.. ర‌బ్బా మేరా క్యా హోగా ( దేవుడా.. నేను చేసిన పాపం ఏంటి? దేవుడా.. నాకేమ‌వుతుంది?)  అని డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఇపుడు విలపిస్తున్నాడు .హర్యానాలోని  రోహ్ త‌క్ జైలులో గుర్మీత్  పంజాబీలో త‌న‌లో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు. అంతే కాదు, రోహ్ త‌క్ లోని సున‌రియా జైలులో ఆయ‌న‌కు 20 ఏండ్ల శిక్ష తీర్పును తలుచుకుంటూ ‘ న‌న్ను ఉరితీయండి.. నాకు బ‌త‌కాల‌ని లేదు,’  అని జ‌డ్జిని వేడుకున్నాడ‌ట‌.అంతేకాదు, ఒకపుడు బాబా గా ఉంటూనే విలాసవంతమయనజీవితానికి అలవాటు పడిన డేరాబాబు జైలు కాలుమోపాక అయిదు రోజులు అన్నం ముట్టలేదట.

పాలు, టీ, బిస్కెట్లు త‌ప్పితే ఇంకా ఏమీ తీసుకోవడం లేదు. గుర్మీత్ కు వీఐపీ ట్రీట్ మెంట్ అందటంలేదు.  గుర్మీత్ నూ సాధార‌ణ ఖైదీల్లాగానే జైలు అధికారులు ట్రీట్ చేస్తున్నారట. ఆగ‌స్టు 28 న  జైలు కు వ‌చ్చాక రోజు రాత్రి అస్స‌లు నిద్ర‌పోలేదు.ఈ విషయాలను  సున‌రియా జైలు ఖైదీ స్వ‌దేశ్ కిరాద్ వెల్లడించారు. ప్ర‌స్తుతం బెయిల్ పై విడుద‌లైన స్వదేశ్ గుర్మీత్ జైలు లో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో వెల్లడించాడు.

 

సొంతంగా రోడ్డేసుకున్నతెలంగాణా గ్రామస్థులు

తెలంగాణా, నిజాంబాద్ జిల్లా ఇందల్వాయ్ మండలం వాసులు  తమ వూరికి రోడ్డు లేని దీర్ఘకాలిక సమస్యను నిదానంగానైతేనేం పరిష్కరించకున్నారు.అయితే, వాళ్లు రోడ్డేసుకున్న తీరు ప్రభుత్వాలకి చెంపపెట్టవుతుంది. చాలా మారుమూల గ్రామాలకు ఒక ఒక పరిష్కారం చూపుతుంది. అయితే, ప్రభుత్వాలకు అన్ని రకాల టాక్సులు కట్టినపుడు మెడలు వంచి రోడ్డు తెప్పించుకునే మార్గం అన్వేషించాలి. మన రోడ్డు మనమే వేసుకుందామనుకోవడం మంచిదే. దీనిని చూసి సిగ్గు పడి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతతో మారమూల గ్రామాలకు రోడ్డేసేందుకు పూనుకోవాలి.  ఇందల్వాయి మండల పరిధిలోని లోలం గ్రామస్తులు అన్సాన్‌పల్లి, భీమ్‌గల్,సిరికొండ, ధర్‌పల్లి, గోవింద్‌పల్లి గ్రామాలకు వెళ్లే రహదారిని తామే  బాగుచేసుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారే ముందుకురికి రోడ్డు బాగుచేసుకున్నారని సర్పంచ్ అనురాధ తెలిపారు. అయితే, దీనికి  15 ఏళ్ల కాలం పట్టింది. ప్రతి ఏడాది గ్రామస్తులంతా రోడ్డు బాగు కోసం ఇంటికొకరు వచ్చేవారని ఆమె పేర్కొన్నారు. గతంలో రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా, నిధుల మంజూరుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి హామీ ఇచ్చినట్లు చెప్పారు.ఈ హామీ  అమలుకాకపోవడంతో  5కి.మీ ఈ రహదారి బాగుపడితే అందరికీ మేలు జరుగుతుందని భావించి శ్రమదానంతో పూర్తి చేసుకున్నారు.

  విషవాయువు వెళువడుతున్నదని గ్రామస్తుల ఆందోళన

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోదురుపాడు వద్ద ఉన్న ఒక ఫెటిలేజెర్ ఫ్యాక్టరీ నుండీ  విషవాయువు వెలువడుతుందని గ్రామస్తుల ఆందోళన చేస్తున్నారు.ప్రజలంతా వచ్చి రోడ్డుపై బైటాయించారు...పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

    డేరా బాబా గారి అశ్రమం లోపల ఎలా ఉందో చూస్తారా...

రేప్ కేసులో ఇరవైయేళ్ల శిక్ష పడి జైలులో ఉన్న బాబా డేరాలో అనుభవించిన విలాస జీవితం అత్యంత సంపన్నులకే సాధ్యం. పేరుకే బాబాగా ని, ఆయన బెడ్ రూం, డైనింగ్ హాల్ ఫైవ్ స్టార్ హోటల్ వసతులతో నిగనిగలాడుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియోచూడండి..

 

    తల్లిదండ్రులను కావడిలో మోసి... నిరసన

ఒదిషా కు చెందిన ఒక వ్యక్తి అనను అకారణంగా జైలుకు పంపినందుకు ఒక వినూత్న  తరహాలో నిరసన వ్యక్తం చేశారు.తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకొని భుజంపై మోసికెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రపంచం దృష్టికి తీసుకువచ్చాడు. ఈ సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ లో జరిగింది. 2009 సంవత్సరంలో ఒక గిరిజనుడిపై పోలీసులు కేసు నమోదు చేసి 18 రోజుల పాటు జైలులో ఉంచారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తాను ఎటువంటి తప్పు చేయలేదని తనపై తప్పుడు కేసు పెట్టాడని పై అధికారులకు విన్నవించాడు. ఎవరూ పట్టించుకోలేదు.  తనకు న్యాయం చేయాలని కోరుతూ  తన తల్లిదండ్రులను 40 కిలో మీటర్ల దూరం కావడిలో మోసుకెళ్లి నిరసన తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది.

  పరిటాల శ్రీరామ్ పెళ్లి ఏర్పాట్లలో విషాదం: ఇద్దరు మృతి

 

 ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్-జ్ఞానవిల వివాహం అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామాగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం ఆగస్టు 10న హైదరాబాద్‌లో జరిగింది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానవితో పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ 1న నిశ్చయించారు.

 

నకిలీ నక్సలైట్ పత్తి శ్రీనివాసరెడ్డి అరెస్ట్

మావోయిస్టునని చెప్పుకుంటూ వ్యాపారస్తుల బెదిరించి  డబ్బు వసూలు చేస్తున్న పత్తి శ్రీనివాస  రెడ్డి ఆంధ్రపోలీసలు అరెస్టు చేశారు.శ్రీనివాసరెడ్డిది  కరీనగర్ జిల్లా. 42మంధి దగ్గర మావోయిస్టు పేరుతో  వసూల్ చేశాడు. మావోయిస్టు పార్టీ సభ్యుడినని బిగ్ షాట్ లకు పోన్ చేసి వసూల్ చేస్తున్నాడు. విజయవాడ కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి సమాచారం మేరకు పోలీసులు ఇతగాడి కోసం మాటువేశారు. ఇతని బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని విజయవాడ  డీసీపీ గజరవు భూపాల్ చెప్పారు.ఇటువంటి ఫోన్ కాల్స్ ఇచ్చినప్పుడు ప్రజలు పోలిసులకు సమాచారం ఇవ్వాలపి ఆయన కోరారు.

విజయవాడ పాత ప్రభుత్వ హాస్పిటల్ లో ఘోరం

గన్నవరం మండలం కోండపావులూరు  గ్రామానికి చెందిన మమత డెలివరీ కి పాత ప్రభుత్వ హాస్పిటల్ రెండురోజుల క్రితం జాయిన్ అయ్యింది. పండంటి అడ బిడ్డకు జన్మనిచ్చింది. పాప పరిస్థితి విషమంగా ఉంది.  ఐ సి యు లో ఉంది.మమత అనారోగ్యానికి డాక్టరు నిర్లక్ష్యం గా వైద్యం చెయ్యటమే కాక మమత  చర్మం లోకి తెల్ల రక్తకణాలను ఇంజక్ట్ చేసినట్లు బంధువులు అరోపించారు. ఇది వికటించింది. చేతికి  స్పర్శ లేకుండాపోయింది. తర్వాత  వైద్యం చెయ్యటానికి వైద్యులు నిరాకరించారు.అంతేకాదు, బయట డాక్టర్‌ లతో వైద్యం చేయించుకోవలని సూచించారు. చర్మనికి సంబంధించిన వైద్యులు మా దగ్గర లేరు బయట హాస్పిటల్ వైద్యం చేయించుకోవాలని అనడంతో, ఇది మీరు చేసిన పనే కాబట్టి మీరే వైద్యం చేయాలని బంధువుల ఆందోళనకు దిగారు. మమత విషయంలో స్పందించాటానికి ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు, వైద్యం చేసిన డాక్టర్ లు నిరాకరిస్తున్నారు.

  తెలంగాణ ట్రయల్ కోర్ట్ ల బంద్

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ఇటీవల ఉమ్మడి హైకోర్టు  చీఫ్ జస్టిస్ జారీ చేసిన సర్క్యులర్ కు నిరసనగా ఈ రోజు తెలంగాణ లో ఉన్న అన్ని ట్రయిల్ కోర్టులలో న్యాయవాదులు బంద్ పాటిస్తున్నారు. న్యాయవాదుల బంద్ కు బార్ అసోసియేషన్  మద్దతు ప్రకటించింది.

సీబీఐ కోర్ట్ కు హాజరయిన జగన్

అక్రమాస్తుల ఆర్జన అరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి   ఈ రోజు సీబీఐ కోర్ట్ కు హాజరై య్యారు.  అయితే, కేసు తదుపరి విచారణ ఈ నెల 8 కి వాయిదా వేశారు. వ్యక్తి గత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసుకున్న పిటిషన్ ను నిన్ననే కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అందువల్ల ఆయన ప్రతిశుక్రవారం కూడా ఎక్కడ ఏ కార్యక్రమంలో ఉన్నా, చివరకు పాదయాత్రలో ఉన్నాహైదరాబాద్ కు వచ్చి సిబిఐ కోర్టు ముందు హాజరుకావలసి వుంటుంది.

 

కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో దారుణం

 

మునిసిపల్ ప్రాధమిక పాఠశాలలో ఒక దారుణం జరిగింది.  స్కూలు సరిగ్గా రావడం లేదంటూ 5 వ తరగతి విద్యార్థి బంగార్రాజు కు శిక్ష ఉపాధ్యాయిని అరుణ పిల్లవాడి వయసుకు మంచిన కఠినశిక్ష విధించింది. బంగర్రాజు 200 గుంజీలు తీయాలనింది.  అంతేకాదు,పిల్లవాడిని దగ్గరుండి అరుణ గుంజీలు తీయించింది. దీనితో విద్యార్థి కాళ్ళు  నడుము వాచి పోయాయి.  నడవలేని స్థితి వచ్చింది. నిలబడితేకూలబడుతున్నారు. దీనితో తల్లితండ్రలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నంతా ఆస్పత్రిలోనే విద్యార్థికి చికిత్స చేశారు. రెండు రోజుల క్రితం ఈ  ఘటన జరిగింది. తీవ్ర ఆవేదనకు గురయిన తల్లితండ్రులు   ఇ వాళ స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.

సికింద్రాబాద్ క్యాంట్ ఏరియాలో అగ్ని ప్రమాదం


కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ గుడిసెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.10 గుడిసెలో మంటలు అంటుకున్నాయి.ఈ ఘటనలో ఇంట్లో సామగ్రిని పూర్తిగా కాలిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చి బతుకు దేరువు కొరకు గుడిసెలో గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నారు.సుమారు 500 గుడిసెలు ఉన్నాయి.ఉదయం 8.గంటల సమయం లో ఓ గుడిసెలో నుండి మంటలు అంటుకున్నాయి..వేణు వెంటనే మరి కొన్ని గుడిసెలకు మంటలు వ్యాపించాయి.అగ్ని మపక సిబ్బంది మంటలను అర్పివేశారు.

 

పారిపోయిన కర్నాటక పిల్లలు హైదరాబాద్ లో ప్రత్యక్షం

 

ఇంటి నుండి పారిపోయి వచ్చిన ముగ్గురు కర్ణాటక పిల్లలు హైద్రాబాద్ కోఠి ఆంధ్ర బ్యాంక్ వద్ద ప్రత్యేక్షమయ్యారు.  వారి పేర్లు లాక్ష్ ,కరణ్ ,వినిత్.వీరంతా బీదర్ కు చెందిన వారు.    వీరిలో  లాక్ష్ కర్ణాటక అగ్రికల్చర్ మినిస్టర్ఈశ్వర్ బేమన్న తాండ్ర కి మేనల్లుడు. వారి గిరించిన సమాచారంఅందడంతో మంత్రి హైదరాబాద్ కు వచ్చారు. పిల్లలను సుల్తాన్ బజార్ పోలీసులు ఆయనకు అప్పగించారు . తెలంగాణ పోలీసుల పనితీరును కర్నటక మంత్రి ఎంతగానో  అభినందించారు.

దర్శకుడు చలపతి, హీరో సృజన్ లకు బెయిల్ మంజూరు

వర్దమాన నటి కావ్య పై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న  దర్శకుడు చలపతి, హీరో సృజన్ లకు బెయిల్ మంజూరు

కావ్య కావాలనే మాపై  ఆరోపణలు చేసిందని,కారులో ఎటువంటి అఘాయిత్యానికి మేము పాల్పడలేదని వారుకోర్టుకు నివేదించారు.

కారు ప్రమాదానికి గురి కావడంతో ఆందోళన చెందిందని, తాను కూడా తమతో పాటే ఆసుపత్రిలో చికిత్స తీసుకుందని వారు చెప్పారు.

ఆమె ఆరోపణలు కారణంగా మా జీవితాలు నాశనమయ్యాయని వారు ఆవేదన చెందారు.

 

 కొమరవెళ్లి గుడి దగ్గిర భక్తుల ఆందోళన 

 

తెలంగాణ సిద్ది పేట జిల్లా కొమురవేల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం లో నాన్యతలేనీ ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయి అని   భక్తులు,ఆందోళనకు దిగారు. బూజు పట్టిన లడ్డూ, మూడు రొజుల నుండి నిల్వవుంచిన చద్ది   పులిహొర  ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పులిహోర దర్వాసన కొడుతూ ఉందని వారు చెబుతున్నారు. ఇలాంటి పులిహోర, ప్రసాదం విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని  ఆందోళన చేస్తున్న భక్తులు చెబుతున్నారు. వారికి  తెలిపిన సి పి యం పార్టీ నాయకులుపూర్తి మద్దతుతెలిపారు.

loader