మంత్రిపదవి కోల్పోయిన కపిల్‌ మిశ్రా కేజ్రీవాల్‌ లంచగొండి అని విమర్శించారు.ఓ మంత్రి  నుంచి ఆయన డబ్బులు తీసుకున్నారని దానికి తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు.అయితే కుమార్‌ విశ్వాస్‌తో జట్టు కట్టారన్న కారణంతో కపిల్‌ మిశ్రాను కేజ్రీవాల్‌ శనివారమే మంత్రివర్గం నుంచి తప్పించారు. 

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజతయం తర్వాత ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. మొన్న పార్టీ కీలకనేతల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ అసమ్మతి రాగం వినిపించడంతో ముసలం బయలుదేరింది.

అయితే ఆ తర్వాత ఆయన చల్లబడటంతో అంతా సద్దుమణిగిందని భావించారు. ఈ లోపే ఆప్ అధినేత, నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పార్టీకి చెందిన కీలక నేత సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రిపదవి కోల్పోయిన కపిల్‌ మిశ్రా కేజ్రీవాల్‌ లంచగొండి అని విమర్శించారు.ఓ మంత్రి నుంచి ఆయన డబ్బులు తీసుకున్నారని దానికి తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు.అయితే కుమార్‌ విశ్వాస్‌తో జట్టు కట్టారన్న కారణంతో కపిల్‌ మిశ్రాను కేజ్రీవాల్‌ శనివారమే మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆ కోపంతోనే ఆయన ఇలా అని ఉంటారని అనుకుంటున్నారు.

అయితే పార్టీ సహచరుడే ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఆప్ నేతల్లో కలవరం మొదలైంది.కేజ్రీవాల్‌ తన ముందే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకున్నారు. కేజ్రీవాల్‌ బంధువుల కోసం రూ.50కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించినట్లు జైన్‌ నాతో చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కు ఇస్తాని అని మిశ్రా మీడియా ముందు ప్రకటించారు.

అంతేకాదు కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని. ఆయనపై సీబీఐ విచారణ జరపాలని, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

అయితే మిశ్రా ఆరోపణలను దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాఖండించారు. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. మంత్రిపదవిలో ఉండి అవినీతి చేయడం వల్లే ఆయనను తొలగించామని ఆ కక్షతోనే ఆయన తమపై బురదజల్లుతున్నారని విమర్శించారు.