Asianet News TeluguAsianet News Telugu

ఇంటి కోసం లోన్ అప్లై చేస్తున్నారా... ఈ విషయాలు తెలుసా?

  • మీ వయసును బట్టి మీ దరఖాస్తును పరిశీలిస్తారు
  • నెలసరి ఆదాయంలో 50శాతానికి లోపు నెలసరి వాయిదాలు ఉండటం మంచిది.
Applying For A Home Loan Heres How To Avoid Getting Rejected

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీనిని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు.  ఎంతో శ్రమించి, సమయం వెచ్చించి సరైన ఇంటి కోసం వెతుక్కుంటారు. మన జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. మరి అలాంటి ఇంటిని లోన్ లో తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి కోసం లోన్ అప్లై చేయగానే వస్తుందనుకోవడం పొరపాటు. సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇంటికి లోన్ వస్తుంది. మరి ఆ జాగ్రత్తలేమిటో చూద్దామా..

ఇల్లు కొనాలంటే.. ముందుగా మనకు సరిపడా నిధులు ఉండాలి. అలా లేని సమయంలో మనం రుణం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తాం. ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాలు అప్లై చేయడం సులవే. కానీ.. అప్లై చేసుకున్న రుణం రిజెక్ట్ కాకుండా చూసుకోవాలి. అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడానికి బ్యాంకు ల దగ్గర చాలా కారణాలే ఉంటాయి. అయితే రుణం తీసుకునే ముందు మీకు ఎంత రుణం రావచ్చు? బ్యాంకులు మిమ్మల్ని ఎలా అంచనా వేస్తాయి? మీ దరఖాస్తును ఎలా పరిశీలిస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలి.

 

వయసు కేవలం ఒక సంఖ్య కాదు..

లోన్ విషయంలో బ్యాంకులు వయసును కేవలం ఒక సంఖ్యగా పరిగణించరు. మీ వయసును బట్టి మీ దరఖాస్తును పరిశీలిస్తారు. ఒక వేళ మీ వయసు  పదవీ విరమణకు దగ్గరగా ఉందంటే.. మీ లోన్ రిజక్ట్ అయినట్టే. ఎందుకంటే మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించగలరో లేదో.. అనే అనుమానం వారిలో ఉంటుంది. 25నుంచి 30 వయసు వారికైతే రుణం త్వరగా వచ్చే అవకాశం ఉంది. వీరితో పోలిస్తే.. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు రుణం చెల్లించడం కష్టమని వారి భావన.వయసు ఎక్కువగా ఉన్నవారు షార్ట్ టర్మ్ విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం. తద్వారా రుణాన్ని త్వరగా పొందవచ్చు. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది.

ఎంత రుణం కోసం అప్లై చేస్తున్నారు..

మీరు అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు, రుణ సంస్థలు.. మీ ఆదాయాన్ని అంచనా వేస్తాయి. మీకు వచ్చే ఆదాయానికి.. నెలకు ఎంత వాయిదాలు చెల్లిస్తున్నారు లాంటి విషయాలు పరిగణిస్తాయి. నెలసరి ఆదాయంలో 50శాతానికి లోపు నెలసరి వాయిదాలు ఉండటం మంచిది. ఒక వేళ మీకు ఇతర రుణాలు ఏవైనా ఉంటే.. మీ భార్య/ భర్త, పిల్లల పేరు మీదకు మార్చకుంటే మంచిది. అలా చేస్తే.. మీకు రుణం ఎక్కవ వచ్చే అవకాశం ఉంటుంది.

మంచి క్రెడిట్ స్కోర్ అవసరం..

కొత్తగా రుణం రావాలంటే.. మంచి క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర , ఆదాయం అన్నీ సరిగా ఉండాలి. ఆదాయంతో పోలిస్తే.. అప్పులు తక్కువగా ఉండాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న ఖాతాదారులపై బ్యాంకులు సానుకూల దృక్పథం ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోరు ఉంటే.. రుణం వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 750 కి ఎక్కువగా ఉంటే మంచిది.. 600 కన్నా తక్కువగా ఉంటే వారిపై వ్యతిరేక అభిప్రాయం వచ్చేస్తుంది. స్కోర్ తక్కుగా ఉన్న వారు ముందుగా తమకు ఉన్న చిన్న రుణాలను తీర్చుకొని.. ఆ తర్వాత హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తు రిజెక్ట్ కావడానికి గల కారణాలు..

యుటిలిటీ బిల్లులు చెల్లించకపోవడం..

కొన్ని బ్యాంకులు, రుణాలు ఇచ్చే కంపెనీలు.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై పూర్తి సమాచారం తెలుసుకుంటారు. వారు కరెంటు బిల్లులు లాంటివి చెల్లిస్తున్నారో లేదో.. ఈఎంఐలు సరిగా కడుతున్నారోలేదో.. క్రెడిట్ కార్డు బిల్లులు సరైన సమయంలో చెల్లిస్తున్నారో లేదో తెలుసుకుంటారు. వీటిల్లో ఏదైనా చేయడం లేదని తెలిసినా.. దరఖాస్తు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది.

ఉద్యోగ నిలకడ..

ఇంటి రుణం కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఉద్యోగ నిలకడను కూడా దృష్టిలోకి తీసుకుంటారు. ఆ వ్యక్తి కనీసం రెండు సంవత్సరాలైనా ఒక కంపెనీలో పని చేస్తూ ఉండాలి. నిలకడ లేకుండా ఉద్యోగాలు మారే వారికి కూడా రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపరు.

బిల్డర్ రెప్యూటేషన్..

రుణం ఇచ్చే ముందు బిల్డర్ రెప్యూటేషన్ ని కూడా పరిగణిస్తారు. ఇంటి పత్రాలు లీగలా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఎలాంటి లిటికేషన్లు లేకుండా క్లియర్ గా ఉన్నాయో లేదో చూస్తారు.

ఇంటి పత్రాలు..

రుణాన్ని ఇచ్చే ముందు సంస్థలు ముందుగా పరిశీలించేంది మీరు కొనాలనుకుంటున్న  ఇంటికి సంబంధించిన పత్రాలు. మీరు ఎంపిక చేసుకున్న ఇల్లు అన్ని అనుమతులకూ లోబడి నిర్మించారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఇవన్నీ సరిచూసుకున్నాక బ్యాంకులకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే.. మీ ఆదాయానికి సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తాయి.

ఒక వేళ మీ దరఖాస్తు రిజెక్ట్ అయితే.. వెంటనే మళ్లీ మళ్లీ అప్లై చేయకండి.  మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోని ఆ తర్వాత తిరిగి ప్రయత్నించండి.

Adhil shetty, Bank bazaar.com, ceo

Follow Us:
Download App:
  • android
  • ios