Asianet News TeluguAsianet News Telugu

రూ.28వేలకే యాపిల్ కొత్త ఐప్యాడ్

బడ్జెట్ ధరకే ఐప్యాడ్ అందిస్తున్న యాపిల్
Apple’s new iPad with Pencil support is just $299 for schools

సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ నుంచి వచ్చే ప్రతి ఎలెక్ట్రానిక్ వస్తువులకి భారత్ సహా.. ఇతర దేశాల్లోనూ డిమాండ్ చాలా ఎక్కువ. యాపిల్ ఏదైనా విడుదల చేస్తోంది అని తెలిస్తే చాలు.. క్యూలో నిల్చోని మరి కొనుగోలు చేస్తుంటారు. కాగా..యాపిల్ తాజాగా చికాగోలో క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఈవెంట్‌లో 9.7 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న కొత్త ఐప్యాడ్ (2018 వేరియెంట్)ను విడుదల చేసింది. దీనికి యాపిల్ పెన్సిల్ సపోర్ట్‌ ను అందిస్తున్నారు. ఈ కొత్త ఐప్యాడ్‌లో యాపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్‌ను ఏర్పాటు చేశారు. ఇదే చిప్ ప్రస్తుతం ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లలో ఉంది. ఈ ఐప్యాడ్‌లో రెటీనా డిస్‌ప్లేను కూడా ఏర్పాటు చేశారు. 

ఇక కొత్త ఐప్యాడ్‌లో టచ్ ఐడీ, హెచ్‌డీ ఫేస్‌టైం కెమెరా, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, ఎల్‌టీఈ, ఐఓఎస్ 11 వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. యాపిల్ కొత్త ఐప్యాడ్ సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో రూ.21,330 ధరకు అమెరికా మార్కెట్‌లో లభిస్తుండగా, భారత్‌లో రూ.28వేల ధరకు ఏప్రిల్ నెలలో ఈ ఐప్యాడ్ యూజర్లకు లభ్యం కానుంది. ఇదే ఐప్యాడ్‌కు చెందిన వైఫై, సెల్యులార్ మోడల్ ధర రూ.38,600గా ఉంది. ఇక ఐప్యాడ్‌తోపాటు యాపిల్ పెన్సిల్ కూడా కావాలంటే అదనంగా మరో రూ.7600 చెల్లించాల్సి ఉంటుంది. 

యాపిల్ ఐప్యాడ్ 9.7 ఇంచ్ (2018) ఫీచర్లు... 
9.7 ఇంచ్ రెటీనా డిస్‌ప్లే, 2048 x 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, యాపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్, ఎం10 కోప్రాసెసర్, 32/128 జీబీ స్టోరేజ్, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఓఎస్ 11, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 10 గంటల బ్యాటరీ బ్యాకప్. 

Follow Us:
Download App:
  • android
  • ios