ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. మరో మూడు  కొత్త మోడల్ ఐఫోన్లను విడుదలచేయనుంది. భారత్ లో ఐఫోన్ ఎస్ఈ మినహాయించి మిగితా అన్ని ఫోన్ల ధరలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలో విడుదల చేయనున్న మూడు ఫోన్లను తక్కువ ధరకే అందించాలని యాపిల్ భావిస్తోందని సమాచారం. గతేడాది ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ ఫోన్లను విడుదల చేయగా.. ఈ సంవత్సరం మరికొన్ని ఫీచర్లను జోడించి మరింత పెద్ద తెరతో మొబైల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోందట.

ఈ మూడు ఫోన్లలో ఒకదానిలో దాదాపుగా ‘ఐఫోన్‌ ఎక్స్’‌ ఫీచర్స్‌ ఉండనున్నాయని సమాచారం. ఈ మోడల్‌ స్క్రీన్‌ సైజు 6.1 అంగుళాల ఎల్ సీడీ తెరతో ఫుల్‌ స్క్రీన్‌ డిజైన్‌తో రూపొందబోతోంది. దీని ధర మాత్రం వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా చూడబోతున్నారని తెలుస్తోంది. ఈ మోడల్‌ 100 మిలియన్ యూనిట్లను అమ్మాలని సంస్థ లక్ష్యంగా యాపిల్ పెట్టుకుంది.

ఇక మరో మోడల్‌ ‘ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్ ’ 6.5 అంగుళాల ఆల్మాయిడ్‌ డిస్‌ప్లేతో , మరో మోడల్ 6.1 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఉంటుంది. ఈ మూడు మోడళ్లు ఫేస్‌ఐడీ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. కానీ ఐఫోన్‌ ఎక్స్‌ తరహాలో హోమ్‌ బటన్‌ ఉండకపోవచ్చని తెలుస్తోంది.