Asianet News TeluguAsianet News Telugu

తగ్గిన ఐఫోన్ డిమాండ్

  • భారత్ లో యాపిల్ బ్రాండ్ లకు గిరాకీ తగ్గింది.
  • గడిచిన ఆరేళ్లలో భారత్ లో యాపిల్ బ్రాండ్స్ గ్రోత్ తగ్గుతూ వస్తోంది.
Apple growth slips to record 6 year low in India says report

మొబైల్ రంగంలో యాపిల్ కంపెనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రోజు ఒక యాపిల్ నుంచి ఒక మోడల్ ఐఫోన్ విడుదల అయ్యిందంటే చాలు.. దానిని కొనుగోలు చేయడానికి నాలుగు రోజులు ముందు నుంచే క్యూలో నిల్చున్న రోజులు ఉన్నాయి. అంతేకాదు.. నెక్ట్స్ వచ్చే వర్షన్ కోసం ఎదురుచూస్తారు కూడా. అలాంటి ఐఫోన్ కి ఇప్పుడు డిమాండ్ తగ్గింది. భారత్ లో యాపిల్ బ్రాండ్ లకు గిరాకీ తగ్గింది. గడిచిన ఆరేళ్లలో భారత్ లో యాపిల్ బ్రాండ్స్ గ్రోత్ తగ్గుతూ వస్తోంది.

2016లో యాపిల్ కంపెనీ భారత్ లో 11,618 కోట్లు సంపాధించగా.. 2015లో 9,937కోట్లు సంపాదించింది. అంటే 2015తో పోలిస్తే.. గతేడాది యాపిల్ కేవలం 17శాతం మాత్రమే అభివృద్ధి సాధించింది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ లో అభివృద్ధి చాలా తక్కువగా ఉండటం గమనార్హం. గతేడాది యాపిల్ కంపెనీకి చెందిన యూనిట్లు భారత్ లో 2.2 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోగా.. ఈ ఏడాది 2.9 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

అలా అని భారత్ లో యాపిల్ కంపెనీ నష్టాల్లో లేదు. కానీ లాభాలు మాత్రం రావడంలేదు. ఇందుకు గల అసలు కారణం ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ లాంచ్ చేయడమేనని కంపెనీ భావిస్తోంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్ లకు నెక్ట్స్ వర్షన్ గా వీటిని విడుదల చేశారు. అంతేకాకుండా అదనంగా ఐఫోన్ ఎక్స్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ లో ఐఫోన్ విలువ అధికంగా ఉంది. అందుచేత కొనుగోళ్లు తగ్గుతున్నాయని కంపెనీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios