మందుబాబులు వొళ్లుమర్చిపోయినా, తూలుతున్నా,  సోలుతున్నా,సురక్షితంగా  బార్ నుంచి పబ్ నుంచి ఇంటికి చేర్చే యాప్ ఒకటి తయారయింది. కాకపోతే, కొంత ఖర్చవుతుంది. యాప్ పేరు ఒకె బాయ్స్.  ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని సంగతేమిటో చూడండి.

మందుబాబులు వొళ్లుమర్చిపోయినా, తూలుతున్నా, సోలుతున్నా,సురక్షితంగా ఇంటికి చేర్చే యాప్ ఒకటి తయారయింది. కాకపోతే, కొంత ఖర్చవుతుంది. యాప్ పేరు ఒకె బాయ్స్. పోలాస రవి కుమార్ ఈ యాప్‌ను నిన్న హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఓకే బాయ్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 మద్యం సేవించిన, ఇంటికి జాగ్రత్త చేరుకోలేమని అనుమానం ఉన్న వారు ఈ యాప్ ను వోపెన్ చేసి వారు తమ సమాచారం, చిరునామా, తాము ఉన్న చోటును కీ ఇన్ చేస్తే చాలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి వచ్చినట్లు ఒక డ్రైవర్, సహాయకుడు ద్విచక్రవాహనంలో నిమిషాలలో మీ ముందు వాలిపోతారు. మిమ్మల్ని గూటిచేర్చి, ఇంటి వారికి సురక్షితంగా అప్పగించే పనంతా భుజానేసుకుంటారు. కాకపోతే, డ్రైవర్‌కు నామ మాత్రంగా రూ.250లు, సహాయకుడికి రూ.100 లు ఫీజు రూపంలో చెల్లించాలి.


గతేడాది ఇదే నెలలో పీకల దాకా దాకి వొళ్లు మర్చిన మందుబాబు ఇష్టమొచ్చినట్లు కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ఆమె తాత, బాబాయిలను పొట్టను పెట్టుకున్న సంగతి చేశాం కదా. ఇదే యాప్ తయారీకి ఇన్ స్పిరేషన్ అంటున్నారు రవి.

టూ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చిన నిరుద్యోగ యువకులు తమ సంస్థ ద్వారా పార్ట్, ఫుల్ టైం ఉద్యోగులుగా పనిచేయవచ్చని ఆయన అన్నారు. మెల్లిగా ఈ యాప్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరుస్తామని ఆయన చెప్పారు.