కావేరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న డీఎంకే దళపతి అపోలో ఆస్పత్రిలో చేర్పించవద్దని సన్నిహితులకు సూచన
డీఎంకే దళపతి కరుణానిధికి అపోలో ఆస్పత్రి భయం పట్టుకుంది. ఈ 92 ఏళ్ల రాజకీయ నేత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు.
అయితే గురువారం రాత్రి ఊపిరితిత్తులలో సమస్య రావడంతో ఆయనను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, తుగ్గక్ ఎడిటర్ చో రామస్వామి అపోలో ఆస్పత్రిలోనే మరణించిన విషయం తెలిసిందే.
దీంతో కరుణ ఈ విషయం తన కుమారుడు స్టాలిన్, ఇతర సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ అపోలోలో తనను చేర్పించవద్దని ముందే సూచించినట్లు సమాచారం.
గురువారం రాత్రి కరుణ అస్వస్థతకు గురికాగానే ఆయన బంధువులు వెంటనే అపోలోకి కాకుండా నేరుగా మరో కార్పొరేట్ ఆస్పత్రి కావేరికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో కరుణానిధి రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు.
