Asianet News TeluguAsianet News Telugu

అంధ్రలో తొందర్లో దోమల మీద హైటెక్ వార్

తిరుపతి, విశాఖ, విజయవాడలలో దోమల మీద హైటెక్ యుద్ధానికి సన్నద్ధం. నిధులకోసం కేంద్రానికి అభ్యర్థన

ap to launch hitech war on mosquitoes

 ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు దోమల మీద హైటెక్ వార్ ప్రకటించబోతున్నారు. ఇక దోమలు చావక తప్పదు. ఆప్టికల్  సెన్సర్స్ ను ఉపయోగించి ముందుగా దోమలు ఎక్కుగా ఎక్కడున్నాయి. ఏ జాతివి, అడామగా కనిపెట్టి  దాడి చేస్తారు.

 

గత సెప్టెంబర్ లో  ఏలూరు నుంచి ఒక దఫా యుద్ధం ప్రకటించినా అంతగా ఫలితం రాలేదు. పైసలేమో బాగా ఖర్చయ్యాయి గాని, దోమలేం తగ్గలేదు.అందువల్ల ఇపుడు హైటెక్ వార్  లోకి వెళ్లాలనుకుంటున్నారు.

 

మొదటి విడతలో విజయవాడ, విశాఖ పట్టణం, తిరుపతి పట్టణాలలో ఈ ‘యుద్ధం‘ జరుగబోతున్నది.  మలేరియా,డెంగి, చికున్ గున్యా, జికా వంటి జబ్బు లు ప్రబలక ముందే ఈ హైటెక్ వార్ ప్రకటించి దోమలను నాశనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

 

ఈ మూడు పట్టణాల భారీ పర్యాటక కేంద్రాలుగా ఎదుగుతూ ఉండటంతో,పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉండటంతో  వాటిని ‘దోమలు లేని ప్రాంతాలు’ గా ప్రటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని మునిసిపల్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దోమలు లేని ప్రాంతాలు కాగానే తిరుపతి, విజయవాడ,  విశాఖలకు విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారని నమ్మకం.

 

దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ స్మార్ట్ మస్కిటో డెన్సిటీ  సిస్టమ్’ అని ఒక ప్రతిపాదనను  కేంద్రానికి పంపించింది. దీనికి ఒకె చెప్పి నిధులు మంజూరు చేయాలని రాష్ట్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ను రాష్ట్రం కోరింది. ఇలా దోమల  మీద హెటెక్ వార్ ప్రకటించబోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే.

 

ఈ మూడు పట్టణాలలో ప్రతిచదరపు కిలో మీటర్ కు  10 ఆప్టిక్ సెన్సర్ లను అమరుస్తారు.  మొత్తం 185 చదరుపు కిలోమీటర్లలో 1850 సెన్సర్లను ఏర్పాటు చేస్తారు. కరెంటు స్థంభాల మీద  అమ్చరిన ఈ సెన్సర్లు దోమల  ఉనికి,బయోడేటాను సెంట్రల్ డేటా బేస్ కు పంపిస్తాయి. దీనిని అధారంగా మస్కిటో డెన్సిటీ హీట్ మ్యాప్ లు తయారువుతాయి. వీటి మార్గదర్శకత్వం ప్రకారం ప్రభుత్వం సంస్థలు దోమల నివారణ చర్యలు చేపడతాయి.

 

ఈవ్యవస్థ లో అత్యాధునికి ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ (ఐఒటి) ని వినియోగిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios