టీడీపీ పై ధ్వజమెత్తిన వైసీపీ నేతలు రేవంత్ వ్యాఖ్యలపై సమాధానమిచ్చే దమ్ముందా అంటూ ప్రశ్నించిన వైసీపీ

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, సోమినాయుడులు మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ‘రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే దమ్ము, ధైర్యం టీడీపీ నేతలకు ఉందా? అంటూ మల్లాది ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో సూత్రధారులెవరో రేవంత్‌ ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. స్థాయిని మరచిపోయి ఆరోపణలు చేస్తున్న దేవినేని ఉమ ఇసుక మాఫియా కింగ్‌ అన్న విషయం అందరికీ తెలిసునని వారు పేర్కొన్నారు.

 ఒకవైపు ఏపీలో మంత్రులుగా ఉంటూ ...మరోవైపు కేసీఆర్‌తో కుమ్మక్కు అయింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మంత్రలులు యనమల, పరిటాల, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ లు కేసీఆర్ తో కలిసి లబ్ధి పొందారో లేదో చెప్పాలంటూ నిలదీశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్‌ చేశారు.