నెటిజన్లకు ఏపీ మంత్రి సోమిరెడ్డ హెచ్చరిక

మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియా అంటేనే ఏపీ అధికార పార్టీ టీడీపీ భయపడిపోతుంది.

సోషల్ మీడియా లో వ్యక్తిగత దూషణలతో పోస్టులు పెట్టేవారిని ఉపేక్షించేదే లేదని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ మండలిని కించపరిచేలా పోస్టులు చేశారని పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ అడ్మిన్ రవికిరణ్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన మంత్రి సోషల్ మీడియాలో ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టింగ్‌లు పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి స్పష్టం చేశారు.