హోదా కోసం మంత్రి అయ్యన్న ఎలా డాన్స్ చేశారంటే (వీడియో)

First Published 12, Apr 2018, 6:51 PM IST
ap minister ayyanna patrudu dance with hijras in vishakhapatnam
Highlights
హోదా కోసం మంత్రి అయ్యన్న ఎలా డాన్స్ చేశారంటే (వీడియో)

ఓ వైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని రాష్ర్టవ్యాప్తంగా ప్రజలంతా నిరసనలతో హోరెత్తిస్తుంటే ఓ మంత్రి మాత్రం రికార్డింగ్ డ్యాన్స్ లో పాల్గొని విమర్శలపాలయ్యారు. ప్రభుత్వంలోని కేబినేట్ మంత్రే ఇలా రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొనడం తీవ్ర దుమారం రేపింది. ఇంతకు ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లో పాల్గొన్నది
ఎవరో తెలుసా? చంద్రబాబు ప్రభుత్వంలో  రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ మంత్రిగా పనిచేస్తున్న అయ్య‌న్న‌పాత్రుడు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో  మంత్రి అయ్యన్నపాత్రుడు హిజ్రాలతో కలిసి చేసిన డ్యాన్స్ ఇపుడు తీవ్ర దుమారం రేపుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రజలు, ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వంలోని ఓ మంత్రి ఇలా రికార్డింగ్ డ్యాన్సులో పాల్గినడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ వైరల్ గా మారింది.

వీడియో

 

loader