Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ‘పాము’ కు పాలు పోసి పెంచిందెవరు?

అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా నివ్వెరపోయి, రాష్ట్ర ఎసిబి చరిత్రలో అతి పెద్ద అక్రమార్జన కేసుగా ముద్రేయించుకున్న పాండురంగారావు పాము పాలు పోసింది సబ్బం హరి అట. ఆయన విశాఖపట్టణం మేయర్ గా ఉన్నపుడు వాటర్  వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న 'పాము’ కు ఆశీస్సులందించారని, అక్రమార్జన ఎలా వేటాడాలో కూడా నేర్పించి ఇద్దరు చక్కగా కలసి భుజించారని చెబుతున్నారు.

AP media says notorious AP engineer Pamu was promoted by Sabbam Hari

అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా నివ్వెరపోయి, రాష్ట్ర ఎసిబి చరిత్రలో అతి పెద్ద అక్రమార్జన కేసుగా ముద్రేయించుకున్న పాండురంగారావు పాము పాలు పోసింది సబ్బం హరి అట. ఆయన విశాఖపట్టణం మేయర్ గా ఉన్నపుడు వాటర్  వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న 'పాము’ కు ఆశీస్సులందించారని, అక్రమార్జన ఎలా వేటాడాలో కూడా నేర్పించి ఇద్దరు చక్కగా కలసి భుజించారని చెబుతున్నారు. ఈ విషయం మీద ఉత్తరాంధ్రలో బాగా పేరున్న  విశాఖ లోకల్ డెయిలీ ‘లీడర్’ ఒక అసక్తికరమయిన కథనం ‘ సబ్బం హరిపుట్ట, పాండురావు పాము’ అనే శీర్షికతో  ప్రచురించింది.

 

ఎసిబి రాష్ట్ర వ్యాపితంగా నిన్నంతా  జరిపిన దాడులలో ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ లో ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదిగిన పాండురంగా రావు పాముకు దాదాపు రు.500  కోట్ల విలువయిన అస్తులున్నట్లు వెల్లడయిన సంగతి తెలిసిందే.

 

ఈ విషయాన్ని17 సంవత్సరాల కిందటే ‘పాండురంగ మహాత్యం’ పేరుతో ‘లీడర్’ బయటపెట్టింది. గ్రేటర్ విశాఖలో అవినీతి పెచ్చు పెరిగిపోయిందంటే అందుకు కారణం సబ్బం హరి అనే నని ఈ పత్రిక పేర్కొంది.

 

’సబ్బం హరి అవినీతి వ్యవహారాన్ని పాండురంగారావు దగ్గరుండి చూసుకునేవాడు. మేయర్ కాక ముందు హరి 8181 నెంబర్ డొక్కు స్కూటర్ మీద తిరిగేవాడు.కాని, ఇపుడు కోట్ల కు పడగలెత్తాడు. వందలకోట్ల ఆస్తుల్ని ఎలా సంపాదించాడు. అధికారుల అవినీతిపై ఎసిబి దాడులు చేస్తున్నట్లే సబ్బం హరి వంటి అవినీతి రాజకీయ నాయకుల మీద విచారణ జరిపిస్తే తప్ప ప్రభుత్వం మీద నమ్మకం రాదు. సబ్బం హరి హాయంనుంచే కార్పొరేటర్లకు వాటాలు, అధికారులకు వాటాలు,  విశాఖ నగర పాలక సంస్థగబ్బు పట్టింది,’ ‘లీడర్’ ఘాటు గా వ్యాఖ్యానించింది.

 

సబ్బం హరి అక్రమాల అరోపణలను కూడా లీడర్ ప్రస్తావించింది.

 

‘విశాఖ సీతమ్మ ధార లో సబ్బం హరి నివాసం మీద కూడా అనేక అరోపణలున్నాయి. ఈ లేఅవుట్లోని ఒపెన్ స్పేస్ (పార్క్)ను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్నారన్నవి షయం అందరికి తెలిసిందే. అవినీతలో పాండురంగా రావు పాము అయితే, సబ్బం హరి పుట్ట.... పాండు రంగారావు వాటర్ వర్క్స్ లో ఇఇ అయినా జివిఎం సిలో సివిల్ పనులసారథ్యం కూడా ఆయనదే. దీనికి సబ్బం హరి అజ్ఞ ఉండేది. సబ్బం హరి, పాండురంగారావుల నేతృత్వంలో శివాజీ పార్క్, ముడసర్లోవ పార్క్, టిఎస్ ఆర్ కాంప్లెక్స్ లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, స్వర్ణ భారతి స్టేడియం, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆధునికీకరణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.... వంటి అనేక పనులలో హరి,పాము కలసి కోట్లు కాజేశారు,’ అని ‘లీడర్’ ప్రచరించింది.

 

అసలు విచారణ చేయాల్సింది, పాండురంగారావు, సబ్బంల కనెక్షన్ మీద అని కూడా ఈ పత్రిక వ్యాఖ్యానించింది.

Follow Us:
Download App:
  • android
  • ios