రాష్ట్ర ప్రభుత్వం తమను చులకన చేస్తుంది. పీ జీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు నెలకు రూ.23 వేలే ఇస్తాం అంటున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం తమను చులకనగా చూస్తోందని ఏపీ వైద్యవిద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఐ ఎం ఏ హాల్లో ఈరోజు పీ జీ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘ అధ్యక్షుడు డా.రఘురామ్, ప్రధాన కార్యదర్శి డా.నాగచైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య విద్యార్థులను చులకన గా చూ స్తోందన్నారు. రోజుకో నిబంధన పెట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలనే నిబంధన విధించారని.. అందుకు తామంతా సిద్ధమేనని పేర్కొన్నారు. ఎంసిఐ ఉత్తర్వులు ప్రకారం నెలకు రూ.57 వేలు ఉపకారవేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.33 వేలు మాత్రమే ఇస్తున్నారని.. అదీ సక్రమంగా ఇవ్వడం లేదన్నారు.
ఈ సంవత్సరం నుంచి నెలకు రూ.23 వేలే ఇస్తాం అంటున్నారని. ఎంతో కష్టపడి వైద్య విద్య పూర్తి చేస్తే మమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులతో ప్రజలు మరణిస్తే...రాష్ట్రంలో వైద్యుల కొరత ఉంది అని, ట్రైబల్ ఏరియాలో పనిచేయడానికి పీజీ విద్యార్థులు ఎవ్వరూ రావడంలేదని తమపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ట్రైబల్ ఏరియాలో పని చేసే వారికి నెలకు రూ.1.30లక్షలు,నాన్ ట్రైబల్ ఏరియాలో పని చేసేవారికి రూ.1లక్ష ఇస్తాం అంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేయగా.. దానికి ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఎంసీఐ ఉత్తుర్వుల ప్రకారం కనీస వేతనాలు ఇస్తే ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినాయకులు డా.శృతి, డా.వినీష్, డా.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
