ఈ రోజు కర్నాటకలో అనేక చోట్ల బ్యాంకు పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థుల మీద కన్నడ సంఘాలు దాడి చేశాయి.

కర్నాటలో బ్యాంకు పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థుల మీద కన్నడిగులు దాడులుచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది.ఈ విషయం క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. ఈ సంఘటన మీద ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల రాజప్ప స్పందిస్తూ కర్ణాటకలో ఆంధ్రులపై దాడులు జరగడం దురదృష్టకరం అని అన్నారు. 

భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని కూడా చినరాజప్ప తెలిపారు. ఆంధ్రుల రక్షణకు అన్ని చర్యలు తీసు కుంటున్నామని చెబుతూ జాతీయ స్ధాయి పోటీ పరీక్షల కేంద్రాలను విశాఖపట్నం, విజయవాడల్లో ఏర్పాటుకు కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు.ఆంధ్ర ప్రాంతంవారు ప్రతిభా ఆధారంగా ఎంపిక అవుతుంటే కన్నడ సంఘాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఇది తగదని ఆయన అన్నారు.

సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి 


కర్ణాటకలో అరవై శాతం మంది తెలుగు వారు ఉన్నారు . జాతీయత భావంతో ఉండాలి కానీ ఈ విధంగా గొడవలు పడటం సరికాదు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం ఫై సీరియస్ గా ఉంది . ఎన్నో రోజుల కష్టపడి చదివిన ఆంధ్ర విద్యార్థులకు అన్నాయం జరగకుండా చూస్తాం ....


ఆదినారాయణ రెడ్డి 

జాతీయస్థాయి లో ఉద్యోగ పరీక్షలకు అన్ని రాష్ట్రాల ప్రజలు హాజరు అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా అడ్డుకోవడం సరికాదు. ఆంధ్ర ప్రదేశ్ లో సెంటర్ లేక పోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగింది కనుక ఇక ఫై జరిగే అన్ని పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ లో సెంటర్ ఏర్పాటు చేయాలి. 

కాల్వ శ్రీనివాసులు..


కర్ణాటక లో జరిగిన బ్యాంకు పరీక్షకు రాయలసీమ లో వెనుక బడిన ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత విద్యార్థులు హాజరు ఆయ్యారు. వారిని పరీక్ష రాయకుండా అడ్డుకోవడం దారుణం. ఈ విషయం ఫై సీఎం కూడా సీరియస్ అయ్యరు. కర్ణాటక అధికారులతో మాట్లాడాము. ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లిన ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తాము.