విశాఖ మెట్రో రైల్ కు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 3 కారిడార్లతో మెట్రో నిర్మిస్తారు.మూడు కారిడార్ లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నడుస్తుంది.

విశాఖ మెట్రో రైల్ కు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 3 కారిడార్లతో మెట్రో నిర్మిస్తారు.
మూడు కారిడార్ లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నడుస్తుంది. మొదటి కారిడార్ గాజువాక జంక్షన్ నుంచి NAD జంక్షన్,గురుద్వారా, మద్దిలపాలెం,హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకూ 30.38 కి.మీ ఉంటుంది. గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకూ5.25 కి.మీ లతో రెండో కారిడార్ ఉంటుంది. తాలిచెట్లపాలెం నుంచి చిన వాల్తేర్ వరకూ 6.9 కి.మీ లతో మూడో కారిడార్ నిర్మాణం చేపడతారు.

ఈ మేరకు ఈ మూడు కారిడార్లకు ఆమోదం తెలుపుతు ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ,అర్బన్ డెవెలప్ మెంట్ డిపార్ట్ మెంట్ జివొ జారీ చేసింది.
అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, జివిఎం సి వైజాగ్ మెట్రో రైల్ ప్రాజక్టును ముందుకు తీసుకువెళతాయి.
