మాజీ సీఎస్ పుస్తకం.. టార్గెట్ టీడీపీ?

First Published 13, Apr 2018, 3:38 PM IST
ap former chief secretary ajay kallem writes book on present politics
Highlights
రాజకీయాలపై మాజీ సీఎస్ పుస్తకం

మాజీ సీఎస్ పుస్తకం.. టార్గెట్ టీడీపీ?

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కేవలం పైరవీల కోసమేనని మాజీ సీఎస్  అజయ్ కల్లామ్ రెడ్డి అన్నారు.  1983 బ్యాచ్ ఐఎఎస్ అధికారి  అయిన అజయ్ వృత్తిపరంగా నిజాయితీ పరుడనే గుర్తింపు ఉంది. ఆయన  తాజాగా ఓ పుస్తకం రాశారు. ‘ మేలు కొలుపు’ పేరుతో రాసిన పుస్తకం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చెప్పారు. తాను రాసిన పుస్తకంలో ప్రస్తుత రాజకీయాలు, యువతలో ప్రశ్నించే తత్వం తదితర అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. 

‘‘రియల్ ఎస్టేట్ ఆలోచనలతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అవినీతి పెరిగిపోయింది. వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏపీకి కొత్త రాజధాని కేవలం పైరవీల కోసమే. క్యాపిటల్ పేరుతో డబ్బు వృధా చేస్తున్నారు. మేకప్ వేసుకున్న వారంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీలు సొంత ఎజెండాలను ప్రజలపై రుద్దుతున్నాయి. ఈ జనరేషన్ లో ప్రశ్నించే తత్వం లోపిస్తోంది. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమీ లేదు. కేవలం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే
నా అభిమతం’’ అని పేర్కొన్నారు. కాగా.. ఆయన వ్యాఖ్యలు వింటుంటే.. టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగానే పుస్తకం రాసినట్లు అనిపిస్తోంది. మరి ఈ పుస్తకం రాజకీయంగా ఎంత దుమారం రేపుతుందో వేచి చూడాలి.

loader