Asianet News TeluguAsianet News Telugu

ముద్రగడ కుల అరుపులకు బెదిరేది లేదంటున్న డిజిపి

  • ముద్రగడ యాత్రకు అనుమతి లేదు. ఇవ్వడం కూడా కుదరదు
  • 26న ‘లే సీజ్’ అనే కార్యక్రమం చేపడుతున్నారు. దానికి బెదిరేది లేదు
  • అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవు
ap dgp says state wont be cowed down by mudragada defiance

 

 

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రేపు తలపెట్టిన కిర్లంపూడి- అమరావతి  పాదయాత్రకు పర్మిషన్ లేదని ఆంధ్ర డిజిపి సాంబశివరావు స్పష్టం చేశారు.

ఈ రోజు ఆయన అమరావతి లో   పాదయాత్ర మీద వివరణ ఇచ్చారు. ముద్రగడ పాదయాత్రను ఆయన ఒక కులసంబంధమయిన యాత్రగా వర్ణించారు. ఇలాంటి యాత్రలు హింసాత్మకమయిన చరిత్ర ఉందని చెప్పారు. ముద్రగడ పర్మిషన్ కావాలని ఎక్కడా అడగలేదని కూడ డిజిపి చెప్పారు.ఒక వేళ అడిగినా ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు.జిల్లా పరిధి దాడి జరిగే పాదయాత్ర కాబట్టి అనుమతికి ఇబ్బంది అని స్పష్టంగా చెప్పారు.గత చరిత్ర బట్టే అనుమతులు ఇవ్వాల వద్దా అనేది నిర్థారణ జరుగుతుందని అంటూ గతేడాది ఇలాంటి కుల కార్యక్రమాల వల్ల  బౌతిక దాడులు, ఆస్థి నష్టం, ప్రజలకు ఇబ్బంది కలిగిందనది, సుమారు  60,70 కొట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.

ఆయన చెప్పిన  మరిన్ని విశేషాలు:

2009లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం కచ్చితంగా పర్మిషన్ తీసుకోవల్సిందే.

అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవు.

26న ‘లే సీజ్’ అనే కార్యక్రమం పెట్టారు. దానికి బెదిరేది లేదు.

సెక్షన్ 30, 144 ప్రకారం సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు.

చట్ట వ్యతిరేక యాత్రలో కాపు, దళిత యువత యాత్రలో పాల్గొన కూడదని మనవి.

ఏ నేరం రేపు జరిగినా...ఆస్థినష్టం జరిగినా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.

సెంట్రల్ కు సంబంధించిన ఆస్తులు ధ్వంసం జరిగినా తీవ్రపరిణామాలు‌.

మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, మాకు అందరు సమానమే.

చట్టం వ్యతిరేక చర్యలకు మా బాధ్యత మేం నిర్వహిస్తాం.

ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు జరిగాయని తెలుస్తోంది.

కోస్తా ప్రాంతంలో రెండు ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ పని చేస్తున్నాయి.

అమరావతి, గుంటూరులో కూడా భారీ బందోబస్తు చేసాం.

Follow Us:
Download App:
  • android
  • ios