శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఆ సినిమాని కనీసం 70 సార్లు చూశానని చెప్పారు

ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ సాంబశివరావు.. సినిమా డైలాగులు అదరగొట్టారు. ఆయన చెబుతున్న డైలాగులకు విద్యార్థులు సైతం చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. డీజీపీ సినిమా డైలాగులు చెప్పడమేమిటా అని ఆలోచిస్తున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

వివరాల్లోకి వెళితే.. డీజీపీ సాంబశివరావు ఈరోజు గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు విషయాల గురించి చర్చించారు. అందులో భాగంగానే తనకు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా అంటే ఇష్టమని.. ఆ సినిమాని కనీసం 70 సార్లు చూశానని చెప్పారు. అంతేకాకుండా ఆ సినిమాలోని ఓ డైలాగ్ ని కూడా వినిపించారు. ఆయన అలా సినిమా డైలాగులు చెప్పడం.. అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

కాగా.. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. పిల్లలు మత్తుకు బానిసలైతే అందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని ఆయన అన్నారు. . పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అలాంటివని అన్నారు. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని కోరారు.

మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఊరు దత్తత కాన్సెప్ట్ అందరికీ ఆదర్శంగా నిలిచింది.