హోదా కోసం చంద్రబాబు.. నిరాహార దీక్ష

హోదా కోసం చంద్రబాబు.. నిరాహార దీక్ష

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేయనున్నారు.  రాష్ట్రానికి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఆ రోజే తాను నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు.


రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఈనెల 20న తన పుట్టినరోజు అని. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తానని చెప్పారు. అదేవిధంగా  ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు.

 కేంద్రం లాలూచీ, ముసుగు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తనను విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీకి లేదన్నారు. . రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనే బంద్‌కు పిలుపునిచ్చారని మండిపడ్డారు. అభివృద్ధికి విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంపై రాజీలేని పోరాటానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాజకీయాల్లో మోదీ తన కంటే జూనియర్ అన్నారు. 1995లోనే తాను సీఎం అయితే..2002లో మోదీ సీఎం అయ్యారని గుర్తు చేశారు. 25 మంది ఎంపీలున్న రాష్ట్రాన్ని బీజేపీ కాదనుకుంటోందని.. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని శాసించేది తామేనని చంద్రబాబు అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page