కారు డ్రైవర్లను ఓనర్లుగా చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం  అమరావతిలో లబ్ధిదారులకు చంద్రబాబు కార్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ కాపు కార్పొరేషన్, ఓలా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్‌ ట్రస్టు   నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో  కొంతకాలంగా శిక్షణ ఇచ్చింది.  శిక్షణ పొందిన వారికి  సొంతంగా వాహనాలు కొనుక్కునేందుకు కాపు కార్పోరేషన్‌ ఆర్థికసాయం చేసింది. కొనుగోలు చేసిన వాహనాలకు ఉపాధికి ఢోకా లేకుండా ఓలా సంస్థ చేయూతనిచ్చింది. మొత్తం కోటి 20లక్షల రూపాయలతో 16 హోండా యాక్సెంట్‌ వాహనాలను కొనుగోలు చేయగా వాటిని  ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కారు డ్రైవర్లను ఓనర్లుగా మార్చేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉయోగపడుతుందన్నారు. ఈ వాహనాలను అందుకున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.