రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

అంతకముందు టీడీపీ పార్టీ కార్యాలయ నూతన భవనాన్ని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని సూచించారు. పార్టీ కార్యాలయానికి వెళితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో రావాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.