ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబాలు నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సంబరాల్లో.. చంద్రబాబు, బాలకృష్ణల ముద్దుల మనవడు.. నారా దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అసలు పండగ సందడంతా దేవాన్షే దే. తెలుగు సంప్రదాయ వస్త్రాలైన పట్టుపంచలో మెరిసిపోయాడు.

భోగి పండగ రోజున పట్టుపంచె కట్టుకొని తిరుమల శ్రీనివాసుడిని దర్శిచుకున్న దేవాన్ష్.. సంక్రాంతి రోజున కూడా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిశాడు. దీంతో.. నారా, నందమూరి కుటుంబం ఎక్కడికి వెళ్లినా.. ఇప్పుడు అందరూ దేవాన్ష్ గురించే చర్చించుకుంటున్నారు.

దేవాన్ష్ ని చూసి.. నారా, నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. మరికొందరు అభిమానులైతే.. పంచకట్టులోని  దేవాన్ష్ ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.