8 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ap assembly sanctioned 8 import bills today
Highlights

ఏపీ అసెంబ్లీ గురువారం కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

ఏపీ అసెంబ్లీ గురువారం కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పౌర సేవలకు హామీ కల్పించడంతో పాటు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, భూసేకరణ చట్టానికి సవరణ తదితర ఎనిమిది కీలక బిల్లులను ఆమోదించింది. 2013 భూసేకరణ చట్టానికి 12 సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏపీ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి బిల్లు, ఏపీ పౌర సేవల హామీ బిల్లు, వర్సిటీల్లో నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ రూపొందించిన బిల్లుతో పాటు భూసేకరణ, పునరావాస పరిహార పారదర్శకత హక్కు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ రెండో సవరణ , వడ్డీ వ్యాపారుల నియంత్రణ, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, ఏపీ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ తదితర బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కాగా శాసనసభలో ఇప్పటి వరకు 22 బిల్లులు ఆమోదించారు.

loader