హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణని ఏపీ సీఎం చంద్రబాబు ముంచేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో కనీసం  టికెట్టు కూడా ఇవ్వడం లేదా..? అవుననే సమాధానమే వినపడుతోంది. వివరాల్లోకి వెళితే.. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారట. ప్రస్తుతం ఇదే విషయం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

2019 ఎన్నికలు మరెంతో దూరంలేవు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే విషయంపై టీడీపీ అధిష్టానం చర్చలు మొదలుపెట్టింది. ఈ చర్చల్లో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు బాలకృష్ణకు కూడా సీటు ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారట. హిందూపురం నుంచి తన కొడుకు లోకేష్ ని బరిలోకి దింపాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. హిందూపురం నియోజకవర్గం.. టీడీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టిన గెలుస్తారనే ప్రచారం కూడా ఉంది. పార్టీ పెట్టిన నాటి నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. కాబట్టి.. ఇక్కడి నుంచి లోకేష్ ని నిలబెట్టాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారనే ప్రచారం ఇప్పుడు మొదలైంది.

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయన సినిమాలతో బిజీగా గడుపుతూ నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని పార్టీ నేతల్లో, ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఒకానొక దశలో పార్టీ నేతలు బాలయ్యకి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేశారు.  అందుకే హిందూపురం నుంచి బాలయ్యని దూరం పెట్టాలని భావిస్తున్నారట. అయితే.. కేవలం హిందూపురం నుంచి మాత్రమే దూరంగా పెడుతున్నారా లేదా.. మొత్తం రానున్న ఎన్నికల నుంచే దూరంగా పెడుతున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు బాలకృష్ణ ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందో తెలియాలంటే.. కొంతకాలం ఎదురుచూడాల్సిందే.