ఏ కన్న కొడుకులూ తల్లిని ఇలా చెయ్యరు

ఏ కన్న కొడుకులూ తల్లిని ఇలా  చెయ్యరు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మానవత్వం మంటగలిసిన ఉదంతం వెలుగుచూసింది. తల్లి చనిపోయినప్పటికీ  కొడుకులు ఆమెకు అంతిమసంస్కారాలు నిర్వహించలేదు. ఐదు నెలలపాటు తల్లి మృతదేహాన్ని దాచివుంచి, ఆమె పెన్షన్ తీసుకుంటూ వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకులను అదుపులోకి తీసుకుని, తల్లి మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 

మృతురాలి ఇంట్లోనుంచి విపరీతంగా దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు ” అమరావతి ” ప్రభుత్వం నుంచి రూ. 13 వేలు పెన్షన్ అందుకునేది. ఈ ఏడాది జనవరి 13న ఆమె మృతి చెందింది. 

ఈ సంగతిని ప్రభుత్వానికి తెలియజేయకుండా పెన్షన్ తీసుకుంటూ వస్తున్నారు. కాగా స్థానికులు చొరవతో వీరి బండారం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page