హైదరాబాద్ లో మరోసారి క్షుద్రపూజల  కలకలం

another Worshiping the occult at hyderabad
Highlights

  • హైదరాబాద్ మరోసారి క్షుద్ర పూజలు
  • రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న పోలీసులు

ఉప్పల్ చిలుకానగర్ లో చిన్నారి బలి సంఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో క్షుద్ర పూజల కేసు బైటపడింది. చిక్కడ్ పల్లి దోమల్ గూడ ప్రాంతంలోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పూజలు నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇలా పూజల పేరుతో నిందితులు  హైదరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. 

 
వివరాల్లోకి వెళితే  చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్రపూజలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఓ ఇంటిపై దాడిచేసి పూజలు నిర్వహిస్తున్న శంకర్ లాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.  ఇతడి ఇంట్లో దొరికిన పూజా సామాగ్రిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న శంకర్ రాలపై సెక్షన్ 341. 504. 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు  చిక్కడపల్లి  పోలీసులు తెలిపారు.

loader