నిరుద్యోగులకు మరో శుభవార్త. కేవలం పదోతరగతి, ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పుణె కంటోన్మెంట్‌ బోర్డు టీచర్‌, జూనియర్‌ క్లర్క్‌ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం పదోతరగతి పాస్ అయ్యి ఉండాలి. మొదట రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో ప్రతిభ కనపరిచిన వారికి ఉద్యోగం లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం http://punecantonmentboard.org/jobdate.html వెబ్‌సైట్‌ని వీక్షించండి. ఏప్రిల్ 4వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ.