Asianet News TeluguAsianet News Telugu

బాబు రెండంకెల వృద్ధి ఇందులోనేనా?

  • ఆంధ్రప్రదేశ్ నేరాల్లో రికార్డులు సృష్టిస్తోంది.
  • దేశంలోని  మొత్తం 29 రాష్ట్రాల్లో క్రైం రేట్ లో ఏపీ 11వ స్థానంలో ఉంది.
  • గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో నేరాల శాతం పెరిగిందని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
andhrapradesh top in crime rate

రాష్ట్రం అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధి సాధించిందని.. అందుకు తాన నిర్విరామ కృషే కారణమని చంద్రబాబు గత మూడేళ్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ రెండంకెల వృద్ధి ఎందులో సాధించారో తెలీదు కానీ..నేరాల్లో మాత్రం సాధించేశారు. ఆంధ్రప్రదేశ్ నేరాల్లో రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోని  మొత్తం 29 రాష్ట్రాల్లో క్రైం రేట్ లో ఏపీ 11వ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో నేరాల శాతం పెరిగిందని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.

హత్యలు, దొంగతనాలు, మోసాలు, కిడ్నాప్, అత్యాచారాలు లతోపాటు దొంగ నోట్ల చలామణి, ఎర్ర చందనం స్మగ్లింగ్, గంజాయి రవాణా వంటి నేరాలు పెరిగిపోయాయి. కడపలో గతేడాది నమోదైన నేరాల సంఖ్య 8,755కాగా, ఈ సంవత్సరం 16వేలు దాటింది. విజయనగరం జిల్లాలో గతేడాది 5232 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 10,427 కేసులు నమోదైనట్లు పోలీసు గణాంకాలే చెబుతున్నాయి. రాజధాని జిల్లా గుంటూరు సహా నెల్లూరు, తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో నేరాల్లో రెండంకెల వృద్ధి సాధించేశామంటూ పలువురు పోలీసు అధికారులే వ్యాఖ్యానించడం కొసమెరుపు

అయితే.. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండటం కారణంగానే నేరాలను అదుపు చేయడం కష్టమౌతోందని పోలీసులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios