ఏపీ డీజీపీగా మాలకొండయ్య

ఏపీ డీజీపీగా మాలకొండయ్య

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి మాలకొండయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ సాంబశివరావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. సాంబశివరావు పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో మాల కొండయ్య నియమితులయ్యారు. నూతన డీజీపీకి అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ మిగతా వారితో కలిసి కృషి చేస్తామని అన్నారు. పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని చెప్పారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని, హైవేలపై రోడ్డు ప్రమాదాలను అరికడతామని, నేర ప్రవృత్తి ఉన్నవారిని వదిలేదిలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారులు ప్రజల సమస్యలు వినాలని మాలకొండయ్య సూచించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos