యోగా, హెర్బల్ మర్చంట్  బాబారామ్ దేవ్ కు  ఆంధ్రప్రదేశ్ దక్షిణాది పీఠం కాబోతున్నది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి పూర్తి సహకారం అందిస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం చేసుకుని తన యోగ, ఆయుర్వేద వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకుంటున్న రామ్ దేవ్ కు చేయూత నిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 173 ఎకరాల భూమిని కేటాయించింది.

 

విజయనగరంలో జిల్లాల కేటాయించిన ఈ భూమిలో బాబా కుచెందిన మెస్సర్స్ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఒక మెగా ఫుడ్ పార్క్ ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పుతుంది.

 

ఇప్పటికే పతంజలి మెగా ఫూడ్ అండ్ హెర్బల్ పార్కులు మహారాష్ట్ర, అస్సాంలలో వస్తున్నాయి. ఇపుడు ఆంధ్రలో వస్తున్నది మూడవది.  

 

ఈ మెగా పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలోని చిన్నరావు పల్లె వద్ద  172.84 ఎకరాల భూమిని కేటాయించింది.   అధికారులు నిర్ణయించిన ధరకంటే చాలా తక్కువ ధరకు ప్రభుత్వం అంగీకారం తెలపడం విశేషం.  అధికారులు నిర్ణయించిన ధర లో  ఆరున్నర లక్షలు తగ్గించి ప్రభుత్వం మెగా పార్క్ కు భూములు అందించింది. రాష్ట్రం నుంచి  భారీగా ఎర్రచందనం కొనుగోలు చేయడంతో బాబాకు బాబుకి అనుబంధం బాగా పెరిగింది.

 

రాష్ట్రంలో . 500 కోట్ల ఖర్చుతో ఈమెగా  ఫుడ్ పార్క్ ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి మొదటివారంలో ప్రతిపాదనలు పంపింది.  పైలు శరవేగంగా కదిలింది. ఫిబ్రవరి 28 న జివొ విడుదలయింది.

 

పతంజలి ప్రతిపాదనల ప్రకారం ఈ మెగా ఫుడ్ పార్క్ లో30 వేల మంది కి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇందులో అరువేల మందికి  పూర్తి స్థాయి ఉద్యోగాలు లభిస్తే, మరొక 24 వేల మందికి పార్ట్ టైం ఉపాధి దొరుకుతందని చెప్పారు. అంతేకాదు, ఈ మెగా ఫుడ్ పార్క్ వల్ల దాదాపు ఒక లక్ష రైతుకుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఈ ఫుడ్ పార్క్ లో సుగంధ ద్రవ్యాలు, బియ్యం, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, నిమ్మ, అరటి, మామిడి, జామ, పైన్ యాపిల్, అమ్ల, అలో వేరా, కొబ్బరి, పామ్ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తారు.

ఈ సంస్థ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టు పద్దతిలో వారికి కావలసి ఉత్పత్తుల కోసం వ్యవసాయం ప్రోత్సహిస్తుంది.

 

ఈ భూమిని  పతంజలికి అందజేసేముందు ఎపి ఐఐసి ఎకరా కు రు. 9,62,725 చొప్పన ధర నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని ప్రభుత్వానికి  సిఫార్సు చేసింది.

 

అయితే, ప్రభుత్వంకొత్త వలస మండలం, చిన్నరావ్ పల్లి గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలోఉన్న ఈ భూమిని పతంజలి కేటాయించేందుఅమోదం తెలుపుతూ ఎకరా ధర రు. 3 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు  ఇండస్ట్రీస్ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వుల జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ బాబా రామ్ దేవ్ చాలా ప్రాజక్టులు ప్రారంభించనున్నారు. ఇందులో దేశీజీన్స్ ప్యాంట్ల తయారీకేంద్రం, తిరుపతిలో ఆయుర్వేద రిసార్ట్ కూడా ఉన్నాయి. బాబారామ్ దేవ్ ఆయుర్వేద వ్యాపారంతో ఆంధ్రలో ప్రవేశిస్తుంటే, మరొక గురువు జగ్గి వాసుదేవ్ రాష్ట్ర వ్యాపితంగా ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సులను బోధించడంతో పాటు,  అమరావతి లో  ఒక పెద్ద సంస్థను కూడా స్థాపించాలనుకుంటున్నారు. దీనికి దాదాపు 400 ఎకరాలుఅందించేందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అంగీకరించారని చెబుతారు.