తెలుగు రాష్ట్రాలలో రూలింగ్ పార్టీల  ప్యాంట్లు తడిపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు - కామ్రేడ్ నారాయణ

ఆంధ్ర తెలంగాణాలలో ప్రతిపక్షాలను చూసి అధికార పార్టీల పాంట్లు తడుస్తున్నాయని సిపిఐ సినియర్ నాయకడు, జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

అంతేకాదు, వైసిపి ఎమ్మెల్యే ఆర్ కె రోజా అధికార పార్టీ నాయకులకు కాళీమాత లాగాతయారయిందని చెప్పారు.

 శుక్రవారం నాడు గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యే రోజా కేసును ఉదహరించారు. కాళీమాతను చూసినట్లుగా ఎమ్మెల్యే రోజాను చూసి టిడిపి వణికిపోతున్నదని కామ్రేడ్ నారాయణ వ్యాఖ్యానించారు.

నారాయణ ఎవరినైనా ఏమయిన అనగల ధీమా ఉన్నవాడు. మచ్చలేనినాయకుడు. అందుకే ఆయన అబ్జర్వేషన్స్ చాలా లోతుగా ఉంటాయి.

 ’ఆంధ్రలో టీడీపీ తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలను చూసి ప్యాంటులు తడుపుకుంటున్నాయి,’అనేశారు.

సభ్యులు ఏదో మాట అన్నారని, మరోలా ప్రవర్తించారని అక్కడ ఇక్కడ అసెంబ్లీలో ఇలా (ఇక్కడ రోజా అక్కడ రేవంత్ రెడ్డి, సండ్ర) సస్పెండ్‌ చేసుకుంటూ వెళితే ఎవరు మిగలరని నారాయణ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలను సభకు రానీయకుండా చేస్తున్న పద్ధతి అప్రజాస్వామికంగా ఉందని ఆయన విమర్శించారు.

 ఆంధ్ర అసెంబ్లీ లో వైసిపి నగరి ఎమ్మెల్యే రోజాపై నిషేధం కొనసాగించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.