తెలంగాణాలో ఐదు రుపాయల భోజన పథకం బాగుందన్న ప్రచారం ఆయన చెవి దాకా వెళ్లింది. ఇదెంత నిజమో చూడాలనుకుని, క్యూలో నిలబడి ఆ భోజనం చేశారు.

టి ఆర్ ఎస్ ఆఫీస్ నుండి వైసీపీ ఆఫీస్ కు వెళుతుండగా...మండేఎండలో ఒక వ్యక్తి హెల్మెట్ పట్టుకొని #GHMC హరే కృష్ణ ధార్మిక సంస్ధ నిర్వహిస్తున్న రు. 5 భోజన కౌంటర్ వద్ద వెయిట్ చేస్తున్నారు... తదేకంగా చూస్తే... టివిలోల కనిపించే ముఖమే..ఎవరబ్బా... ఈ మధ్య నోటు వోటు కేసులో పిటిషన్ లు వేసి సంచలనం సృష్టించిన

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...

ఆయనెందుకు అక్కడున్నాడు?

తెలంగాణలో ప్రభుత్వం భోజన పథకం బాగుందన్న ప్రచారం ఆయన చెవి దాకా వెళ్లింది. ఎంతో నిజమో చూడాలనుకుని, క్యూలో నిలబడి ఆ భోజనం చేశారు.

మంగళ గిరి నియెజకవర్గంలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నది ఆయన ఆలోచనట.

ఎవరినో అడగడటమెందుకని స్వయంగా జిహెచ్ ఎంసి భోజనం సంగతి చూడాలనుకున్కారు. ఇలా క్యూలో నిలబడి తీసుకున్నారు.

ఈ భోజనానికి మంచిపేరొచ్చింది. తెలంగాణా ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి సహచర కాంగ్రెస్ లో కలసి ఈ భోజనం గాంధీభవన్ తెప్పించుకుని తిన్నారు.

అది బాగుందని అనకుండా ఉండలేకపోయారు.

 ఈపథకానికి మంచి పేరు రావడంతో ఇపుడు రాష్ట్రమంతా విస్తరింపచేసేందుకు మునిసిపల్ మంత్రి కెటిఆర్ ప్రయత్నిస్తున్నారు.