ఆంధ్రా మద్యాంధ్ర బాట పట్టింనట్లుంది. రాష్ట్రం యమ కిక్కతో జోరుగా వూగుతూ ఉంది. నేషనల్, స్టేట్ హైవేలలో  సుప్రీంకోర్టు అర్డర్  ప్రకారం మద్యం షాపులను మూసేసినా,  మా ఇళ్ల మధ్య వైన్ షాపులు పెట్టొద్దని విజయవాడ నుంచి నెల్లూరు దాకా మహిళలు గోల చేస్తున్నా, ఆంధ్రా  మగవాళ్లు పట్టించుకోవడం లేదు. చీర్స్ కొడుతున్నారు. పెగ్గు మీద పెగ్గు వేసుకుంటూ నే ఉన్నారు. గత నాలుగు రోజులలొనే  ఏకంగా రాష్ట్రంలో రు. 200 కోట్ల మందు కొట్టేశారు.

ఆంధ్రా మద్యాంధ్ర బాట పట్టింనట్లుంది. రాష్ట్రం యమ కిక్కతో జోరుగా వూగుతూ ఉంది. నేషనల్, స్టేట్ హైవేలలో సుప్రీం కోర్టు అర్డర్ ప్రకారం మద్యం షాపులను మూసేసినా, మా ఇళ్ల మధ్య వైన్ షాపులు పెట్టొద్దని విజయవాడ నుంచి నెల్లూరు దాకా మహిళలు గోల చేస్తున్నా, ఆంధ్రా మగవాళ్ల పట్టించుకోవడం లేదు. చీర్స్ కొడుతున్నారు. పెగ్గు మీద పెగ్గు వేసుకుంటూ నే ఉన్నారు. గత నాలుగురోజులలొనే ఏకంగా రాష్ట్రంలో రు. 200 కోట్ల మందు కొట్టేశారు- ఇందులో ఎక్కు వ సర్వీసు చేసింది బెల్ట్ షాపులే.

నిజానికి లైసన్సులు రెనివల్ చేయాల్సి ఉన్నందున చాలా చోట్ల షాపులు మూత పడి ఉన్నాయి. అయినా సరే, ఆంధ్రోళ్లు అన్నిరికార్డులు బద్దలు కొట్టి పడేశారు. అయితే, స్టేట్ హైవేలను మామూలు రోడ్లుగా మారుస్తూ మంగళవారం నాడు జివొ వచ్చిన నిమిషాల్లోనే చాలా పట్టణాలలో షాపులు తెరుచుకున్నాయి. దప్పిక గొన్న మందుబాబాయిలంతా క్యూకట్టేశారు. ఉన్నదంతా కొనేశారు. ముఖ్యంగా తెలుగోళ్ల సృష్టి అయిన బెల్టు షాపులు భారీ గా విక్రయాలు జరిపాయి. జూలై నాలుగో తేదీన ఒక్క రోజులనో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ రు.58.82 కోట్ల విలువయిన మందు స్టాక్ ను బయటపెట్టింది. దీన్నుంచి మాకే కళ్లు గిర్రున తిరగాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.

ఇలా సేల్స్ పెరగడానికి కారణం, వూరూర వాడ వాడలా విస్తరించిన బెల్టు షాపులేనని అధికారలు చెబుతున్నారు. దీనినర్థం బెల్టు షాపులు పెరిగే కొద్ది మందు వాకిటిముందుకు సరఫరా అవుతుంది. సేల్స్ పెరుగుతాయి. చీర్స్ పెరుతాయి. రాబడి పెరుగుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా జూన్ నెలాఖార మూడు రోజులలో డిపార్ట్ మెంట్ కొత్త స్టాక్ బయటకు తీయలేదు. సేల్స్ మళ్లీ జూలై 1 మొదలయ్యాయి. ఆరోజు 15 శాతం షాపులు లైసెన్స్ పోంది తెరుచుకున్నాయి. ఈ షాపులు రు. 18 కోట్ల విలువయిన మందుకొనుగోలు చేశాయి. జూలై రెండో తేదీన రు. 56.97 కోట్ల విలువయిన మద్యం కొనుగోలు చేశాయి. జూలై మూడో తేదీన ఇంకా షాపులు ఇంకా రెచ్చిపోయాయి. ఏకంగా రు 75.01 కోట్ల విలువయిన మందు కొన్నాయి.