బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇప్పటి వరకు సన్నీలియోన్ ని మూవీ ప్రమోషన్స్ కోసమో, షాప్ ఓపెనింగ్స్ కోసమో.. ఆమె ఫోటోలను వాడి ఉంటారు. అయితే.. విచిత్రంగా ఒక రైతు మాత్రం తన పంట కాపాడుకోవడం కోసం సన్నీ ఫోటో వాడాడు. అర్థం కాలేదా.. ఇంకెందుకు ఆలస్యం చదవండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరుకు చెందిన అంకినపల్లి చెంచు రెడ్డి అనే రైతుకి 10 ఎకరాల పొలం ఉంది.  అయితే.. ప్రతి సంవత్సరం అతనికీ నష్టమే వస్తోంది. పొలానికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు పెట్టినా లాభం లేదు. దీంతో.. చెంచురెడ్డి తెలివిగా ఈ ఏడాది.. బాలీవుడ్ తార సన్నీలియోన్ ఫోటోలను పెద్ద పెద్ద కటౌట్ లాగా ఏర్పాటు చేసి పొలం చుట్టూ పెట్టాడు. దీంతో.. చెంచురెడ్డి పొలం వైపు నడుచుకుంటూ వెళ్లేవారంతా సన్నీ ఫోటోలను చూస్తూ వెళ్లడం మొదలుపెట్టారు.

కాగా.. ఇన్ని సంవత్సరాలు దిష్టి తగిలి తన పంట సరిగా పండలేదని.. సన్నీ ఫోటోలు పెట్టాక.. పచ్చగా ఉన్న తన పంట వైపు కాకుండా సన్నీలియోన్ ఫోటోలు చూడటం మొదలుపెట్టారని రైతు చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ఈ ఏడాది తన పదిఎకరాల్లో పంట బాగా పండిందని రైతు సంబరపడిపోతున్నాడు. ప్రస్తుతం ఈ రైతు చేసిన పని తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.