ఇండియాకి వచ్చేయండి.. మీకిదే మా స్వాగతం

Anand Mahindra sends strong message to Indian techies
Highlights

  • కఠినంగా మారిన హెచ్ 1బీ వీసా విధానం
  • అమెరికాలోని ఇండియన్ టెక్కీస్ కి ఆనంద్ మహీంద్రా స్ట్రాంగ్ మెసేజ్

అమెరికాలో ఉన్న భారతీయులంతా.. ఇండియా వచ్చేయాలని మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్ 1బీ వీసా విధానాన్ని కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ‘‘ బై అమెరికన్.. హైర్ అమెరికన్’’ అనే నియమాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చారు. అంతేకాకుండా తాజాగా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇచ్చిన ప్రతిపాదన ఒకటి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై పెద్దఎత్తున ప్రభావం చూపనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డ్‌ కు దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై హెచ్‌1-బీ వీసాను పొడిగించుకునే వీలులేకుండా చేయాలన్న నిబంధనే ఇందుకు కారణం. ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. దాదాపు 50వేలు నుంచి 75వేల మంది హెచ్1 బీ వీసా వినియోగదారులు స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై సర్వత్రా చర్చలు కూడా జరుగుతున్నాయి.

 

కాగా... ఈ విషయంపై మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్వర్ వేదికగా స్పందించారు. ‘‘అమెరికా ప్రభుత్వం నిజంగా ఆ నిబంధనను అమలు చేస్తే.. ఇండియన్స్ తిరిగి.. మన దేశానికి వచ్చేయండి. మీకు ఇదే మా స్వాగతం. ఇక్కడికి వచ్చే ఇండియాను అభివృద్ధి చేయండి’’ అంటూ ట్వీట్ చేశారు.

loader