వైసీపీలోకి ఆనం బ్రదర్స్

First Published 17, Apr 2018, 12:38 PM IST
anam brothers ready to join in ycp
Highlights
ఫలించని టీడీపీ బుజ్జగింపులు

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ లు ఎక్కువైపోయాయి. ఇప్పటికే.. చాలా మంది నేతలు టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీ కి మారారు. తాజాగా.. ఈ జాబితాలోకి ఆనం బ్రదర్స్ కూడా చేరిపోయారు.వీరిరువురు త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే వీరు.. జగన్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే.. పార్టీ మారవద్దంటూ టీడీపీ చేసిన బుజ్జగింపులు కూడా ఫలించలేదనే వాదనలు వినపడుతున్నాయి. వచ్చే వారంలో ఆనం సోదరులు టీడీపీని వీడి వైసీపీలోకి అడుగుపెట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆత్మకూరు సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేస్తుండగా.. వెంకటగిరి సీటు కావాలని ఆనం కోరినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆనం బ్రదర్స్ ఇద్దరూ మొదట  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అడుగుపెట్టారు. అధికార పార్టీ లో ఉంటే ఆశించిన పదవులు దక్కుతాయని భావించారు. అయితే.. పదవులు కాదు కదా.. కనీసం గౌరవం కూడా దక్కలేదని వారు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్టీలో చేరిన ఆనం బ్ర‌ద‌ర్స్ కు ఎటువంటి ప్ర‌యారీటి పార్టీ ఇవ్వ‌లేదు, అలాగే పార్టీలో ఉన్న నాయ‌కులు కూడా, జిల్లాలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు  ఆనం బ్ర‌ద‌ర్స్ ను  పిల‌వలేదు.. ఇక రెండు టర్మ్ లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆనం బ్ర‌ద‌ర్స్ కు ప‌ద‌వి వ‌స్తుంది అని ఊహించారు ఆయ‌న కేడ‌ర్...అయితే అటువంటిది జ‌రుగ‌లేదు, అమ‌రావ‌తి వెళ్లి క‌లిసినా వారి సోద‌రుల్లో ఎవ‌రికి ప‌ద‌వి వ‌రించ‌లేదు.
 
దీంతో నెల్లూరు జిల్లాలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కేడ‌ర్ ఉన్న ఆనం సోద‌రులు త‌మ ప్లాన్ మార్చుకోవాలని భావించారు. టీడీపీలో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా.. పదవి రాదు అన్న విషయం వారికి అర్థమైపోయింది. టీడీపీ కాదని బీజేపీలోకి వెళదామా అంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. అలాని మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇక 
వీరికి మిగిలిన ఆప్షన్ వైసీపీనే. అందుకే అటువైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆనం వివేకా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఆనం వైసీపీలో చేరి సీటు సంపాదించాలని 
భావిస్తున్నారు.

loader