వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు..

వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు.. ఉల్లి మాత్రమే కాదు.. వెల్లుల్లి వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం. అందుకే కాబోలు ప్రతి వంటకంలో మన పెద్దలు వెల్లుల్లిని కచ్చితంగా ఉపయోగించేవారు. వెల్లుల్లి వలన కలిగే ఆరోగ్యకరమైన ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దామా..

ఛాతీ సంబంధ వ్యాధులు
ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరిఅయిన ఔషధం. న్యూమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమయిన జ్వరంతో ఉన్నవారి48 గంటల లోపల టెంపరేచరును, నాడీ చలనాన్ని, శ్వాసను వెల్లుల్లి దారిలోకి తెస్తుందని అంటున్నారు. వెల్లుల్లిని నీటిలో మరగబెట్టి క్షయవ్యాధి రోగులు సేవిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. ఒక గ్రాము వెల్లుల్లిని ఒక లీటరు పాలు, ఒక లీటరు నీటిలో కలిపి ఆమొత్తం నాలుగోవంతు మిగిలేదాకా మరగబెట్టి ఆ వచ్చిన డికాక్షన్‌ని రోజుకు 3 సార్లు సేవిస్తే క్షయ నయమవుతుంది.

ఉబ్బసం
వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్‌‌ట – వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి పడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.

జీర్ణకోశ వ్యాధులు
జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణయంత్రాంగానికి సోకే అన్ని రకాల అంటురోగాలనూ వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. అందుకు కారణం- వెల్లుల్లిలో ఉన్న యాంటీ సెప్టిక్‌ గుణం!

హై బీపి నియంత్రణ
బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన మందుగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. మందుల షాపులలో లభించే వెల్లుల్లి క్యాప్యూల్‌‌సని రోజుకు రెండు లేదా మూడిటిని వేసుకోవటం ద్వారా బీపిని దారిలోకి తెచ్చుకోవచ్చు.

లైంగిక సంబంధవ్యాధులు
నపుంసకత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని అమెరికా లోని ప్రముఖ సెక్సాలజిస్ట్  డాక్టర్‌ రాబిన్‌సన్‌ పేర్కొంటున్నారు. సెక్స్  సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్స్ సంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు. తరచుగా వెలుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగికపటుత్వం పెరుగుతుంది. లైంగిక క్రియలో అలసట దూరం అవుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి
జ్వరాల నుంచి త్వరగా కోలుకోవడానికి, రొంప నుంచి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలు ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్తమాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos