వెండి తెరపై కొత్త అందం.. స్టార్ హోదా దక్కేనా?

An Actor In Making, Cuttack Girl Riyana Sets Eyes To Soar Higher
Highlights

ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరోయిన్

వెండి తెర అంటేనే అందాల ప్రపంచం. ఈ అందాల ప్రపంచంలోకి ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం అవుతూ ఉంటాయి. అలా పరిచయమైన వారిలో కొందరు ఒకటి రెండు సినిమాలకే పరిమితమైతే.. మరికొందరు మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతారు. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు  మరో అందాల బామ వెండి తెరపైకి అడుగుపెట్టింది . ఆమె రియానా శుక్లా.
సాధారణంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏది చూసినా ఎక్కువ మంది హీరోయిన్లు ముంబయి , చెన్నై నుంచి వస్తుంటారు. ఇటీవల కేరళ భామలు రావడం కూడా ఎక్కువగా నే కనిపిస్తోంది. కానీ తొలిసారిగా ఒరిస్సా నుంచి ఓ యువతి ఇటువైపుకు అడుగు పెట్టింది. రియానా శుక్లా మొదట ఓలివుడ్ లో నటించి అక్కడి వారిని తన నటతో ఆకట్టుకుంది. అక్కడి నుంచి బాలీవుడ్ ని ఆకర్షించింది. అక్కడా రెండు సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమెకు బెంగాలీ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ కూడా తన
సత్తా చాటేందుకు సిద్ధమైంది.  అక్కడ కూడా గుర్తింపు సాధించే.. ఆమె సౌత్ లోనూ అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా భారతీయ సినీరంగంలో  పెద్ద స్టార్ గా ఎదగాలనుకుంటున్న రియానా కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.

loader