నోట్ల కోసం క్యూల్లేవు. ప్రజలకు నోట్ల కష్టాలు లేవు. నోట్ల చావుల్లేవు. అంతా  పత్రికల సృష్టి. మిథ్య,  మోదీయే నిజం.

నోట్ల రద్దు మీద సృష్టించిన సెగలు పొగలు మెల్లిమెల్లిగా బిజెపి హెడ్ క్వార్టర్ ని కూడా తాకాయి.

దేశ ప్రజల్లో వస్తున్న అలజడి, అసంతృప్తి ని గమనించాలని, దేశ వ్యాపితంగా క్యూలలో చాలా మంది ముసలివాళ్లు చనిపోతున్నారని, దీనిని గమనించి చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపిలు, సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు సలహా ఇచ్చారు.

 అయితే, అంతా మిథ్య, ప్రజల అసంతృప్తి మిధ్య, బ్యాంకులు క్యూల మిథ్య, నోట్ల కొరత మిథ్య , ప్రధాని మోదీ ఒక్కడే నిజం అనే ధోరణిలో సమాధానం మిచ్చారు.

‘పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై ఏమాత్రం లేదు. అందరూ స్వాగతిస్తున్నారు. ఏ మాట్లాడుతున్నారు, మీరు. ప్రజల్లోకి వెళ్లకుండా పత్రికల్లో వచ్చే వార్తలు చదివి నాకు చెబుతున్నారు. చెప్పింది చాలు, ఎక్కువ మాట్లాడకండి. నేనుచెప్పిందిచేయండి. ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయలు తెలుసుకోండి. ఎన్నికల ఫలితాలు మాకు వదిలేయండి,’ అని మోదీ రెండు భుజాలు తానే అయిన అమిత్ షా మొకం చిట్లించుకున్నారు.

ఇదెక్కడో జరగలేదు. రెండు రోజుల పాటు ఢిల్లీలో షా ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేత, కార్యవర్గ సభ్యుల, ఎంపిల సమావేశంలో ఇది వాగ్వాదం జరిగింది.

దేశంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత గురించి ఎంపిలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.అయితే, షా దీనిని నమ్మే స్థితి లో లేకపోవడం వాళ్లని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, ఆయన కు మోదీ తప్ప మరోక విషయం కనిపించని విషయం కూడా వారు గమనించారు.

దీనికి ఎంపిలు, నేతలు భయపడి తోక ముడుసుకుని కూర్చోలేదు.

‘ ప్రజల్లో అగ్రహం చూశాక, వాళ్ల దగ్గిరకు వెళ్లి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయడం సాధ్యమా. జనవరి రెండో వారానికల్లా మార్పు రాకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పాకిస్తాన్ పై చేసిన సర్జికల్ స్ట్రయిక్ గుడ్ విల్ అంతా గాలికి కొట్టుకుపోవడం ఖాయం. యుపి ఎన్నికల్లో గెలిచే విషయం మర్చిపోండి,’ అని ధైర్యంగా ఎదరుచెప్పారు.

‘గత ప్రభుత్వాల్లగా కాదు. ఇది మోదీ ప్రభుత్వమనే విషయం మర్చిపోకండి. అంత ఆయన చూసుకుంటారు,’ అని షా అన్నారు.

కేవలం పొగడ్తలతో సమావేశం నింపి వాస్తవం కనిపించకుండా చేయడం మంచిది కాదని కొంతమంది సీనియర్ లు. ఇలా చేస్తే ముందు ముందు పెద్ద ప్రమాదాలుంటాయి అని కూడా అభిప్రాయపడ్డారట.