Asianet News TeluguAsianet News Telugu

కొరియా పై యుద్దాని సిద్దమ‌న్నా ట్రంప్‌, మాకు సంబంధం లేద‌న్న చైనా

  • ఇక యుద్దమే అన్నా ట్రంప్
  • కొరియా అధ్యక్షడు తగ్గకపోతే బరిలో అమెరికా మిలిటరీ సిద్దం.
  • తప్పుకున్న చైనా.
america warns to koria reday to war

ఉత్త‌ర కొరియా పై యుద్దం సిద్ద‌మంటు అమెరికా అధ్య‌క్షుడు ట్విట్ట‌ర్‌లో ప్రక‌టించారు. కొరియాను రెచ్చ‌గొడుతూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్విట్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.  అమెరికా యుద్ధానికి కావాల్సిన స‌రంజామా సిద్ద‌మైంది. `ఇక‌ ఉత్త‌ర కొరియా తెలివి త‌క్కువగా ప్ర‌వ‌ర్తించ‌డమే మిగిలి ఉంది... కిమ్ జాంగ్ వేరే దారి వెతుక్కుంటార‌ని అనుకుంటున్నా` అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇరు  దేశాల మ‌ధ్య మాటల యుద్దం జ‌ర‌గుతున్న విష‌యం తెలిసిందే, ఇరు దేశాల అధ్య‌క్షుల స్పందన చూస్తుంటే యుద్ద మేఘాలు క‌మ్ముకుంటున్నాయా.. అనిసిస్తుంది. ఇప్పుడు స్వ‌యంగా ఆ దేశ అధ్య‌క్షుడు చేసిన ట్వీట్ల‌తో అమెరికా నిజంగానే యుద్ధానికి సై అంటుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


కొరియాకు చైనా షాక్

ఇది ఇలా ఉండ‌గా ఉత్తర కొరియాను చైనా హెచ్చరించింది. దూకుడు చర్యలు ఆపకుంటే తాము ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించడం స‌రికాద‌ని, అమెరికాతో పెట్టుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించింది. అమెరికాతో యుద్దం అంటే తాము సాయంగా రాబోమని తెలిపింది. ఈ మేరకు చైనాకు చెందిన అధికారిక మీడియా పత్రికలో స్పష్టం చేసింది.  

ఒకవేళ అమెరికానే ముందుగా ఉత్త‌ర కొరియా క్షిపణులు ప్రయోగిస్తే అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని కూడా తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios