న్యూయార్క్ లో బాంబు పేలుడు పోర్ట్ అథారిటి బస్ టెర్మినల్ లో ఘటన పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు 

అమెరికా న్యూయార్క్‌ లోని టైమ్స్ స్క్వేర్ సమీపంలో భారీ బాంబు పేలుడు జరిగింది. మాన్‌ హాటన్‌లోని పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో ప్రాణాపాయం సంభవించనప్పటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఈ పేలుళ్ల సమీపంలోని ఏ, సీ, ఈ వీథులను ఖాళీ చేయించి జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలు అనుమానిత ప్రాంతాల్లోను బాంబు స్వ్కాడ్స్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 అమెరికా భద్రతా అధికారులు కథనం ప్రకారం... బస్ టెర్మినల్ ప్రవేశంలో ఈ బాంబును అమర్చినట్లు అనుమానిస్తున్నారు. పైప్ బాంబు ద్వారా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ దారుణానికి బాధ్యుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.