2018 నవంబరులో ఈ పోటీలు జరగనున్నాయి అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది

అమెరికాలో టీ 20 ప్రపంచ కప్ పోటీలు నిర్వహించనున్నారు. 2018 నవంబరులో ఈ పోటీలు జరగనున్నాయి. అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా మహిళల టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఐసీసీ నిర్వాహకులు తాజాగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఐసీసీ ప్రతినిధులు ఫరా గోర్సి, జానీ గ్రేవ్‌ మాట్లాడుతూ.. టోర్నీలో భాగంగా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లను ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌ మైదానంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ మైదానంలో గతంలో కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించారు. 2016లో భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చినట్లు వారు చెప్పారు.

‘అమెరికాలో ఎంతో మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. యూఎస్‌ఏ పేరుతో జట్టు కూడా ఉంది. అయినప్పటికీ అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మేము వెస్టిండీస్‌తో కలిసి మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్వహించాలని భావించి, జూన్‌లోనే ఐసీసీని సంప్రదింపులు జరిపాం’ అని ఫరా తెలిపారు.