సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా దళాలు ( వీడియో )

సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా దళాలు ( వీడియో )

గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. ఇటీవల రసాయన దాడుల్లో వందల మంది పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశంతో సిరియాపై మెరుపు దాడులు చేపట్టారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు వ్యతిరేకంగా అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. ఫ్రాన్స్‌, యూకే దళాలు కూడా అమెరికాతో చేతులు కలిపి సిరియాపై సైనిక దాడులు చేస్తున్నాయి. కొద్ది  రోజుల క్రితం సిరియాలో జరిగిన రసాయన దాడులపై ఆగ్రహంతో, దానికి ప్రతీకార చర్యగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos