మెట్రో పాలీట‌న్ న‌గ‌రాల్లో మ‌నుషుల క‌న్న వాహానాలు అధికంగా పెరిగిపోతున్నాయి. 10 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాలంటే గంట పాటు నిరీక్ష‌ణ త‌ప్ప‌దు. ఇక ఐటి న‌గ‌రం బెంగ‌ళూర్ అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదే ప‌ది కిలోమీట‌ర్లు చేరుకొవాలంటే గంట‌కు పైగానే స‌మ‌యం ప‌డుతుంది. బెంగ‌ళూర్ ట్రాఫిక్ కి ఒక నిండు ప్రాణాన్ని కొల్పొవ‌ల్సి వ‌చ్చింది.


సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇద్ద‌రు ప్రేండ్స్ బైక్ మీద‌ రోడ్డు పైకి వ‌చ్చారు. అనుకొకుండా ట్రాక్ట‌ర్ వాళ్ల బైక్ ను ఢీ కొట్టింది, డ్రైవ్ చేస్తున్న అబ్బాయికి బాగా గాయాలు అయ్యాయి. రెండ‌వ ప్రేండ్ అంబులేన్స్ కి కాల్ చేశాడు. 20 నిమిషాల్లో వ‌స్తాము అని అంబులెన్స్ అధికారులు చెప్పారు. కానీ అంబులెన్స్ ఆ ఘ‌ట‌న స్థలానికి చేరుకునేలోపే ఆ అబ్బాయి చ‌నిపోయాడు.

హాస్పిట‌ల్ నుండి యాక్సిడెంట్ అయిన స్థ‌లానికి చేరుకొవ‌డానికి 15 నిమిషాలు ప‌డుతుంది. 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. కానీ గంట త‌రువాత అంబులేన్స్ వ‌చ్చింది. గాయాలు అధికంగా అవ్వ‌డం చేత‌ ర‌క్తం ఎక్కువ‌గా పోయింది. ఆ అబ్బాయి అక్క‌డికి అక్క‌డే మ‌ర‌ణించాడు. కార‌ణం అంబులేన్స్‌. ఇక అంబులేన్స్ స‌మ‌యానికి రాక‌పోవ‌డానికి కార‌ణం ట్రాఫిక్‌.


మ‌న ఇండియా దారుణ‌మైన ప‌రిస్థితి ఎంటంటే.. అంబులేన్స్ ఎంత సైర‌న్ కొట్టిన వాహాన‌చోద‌కులు ప్ర‌క్క‌కు త‌ప్పుకోరు. ఎవ‌రైనా నాయ‌కులు వ‌స్తున్నారంటే అంబులేన్స్‌ల‌ను కూడా నిలిపివేస్తారు ట్రాఫిక్ పోలీసులు.