అమేజాన్ సమ్మర్ సేల్.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Amazon Summer Sale Starts May 13 to Take on Flipkart Big Shopping Days Sale
Highlights

హాట్ సమ్మర్ సేల్ లో భారీ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్  వెబ్ సైట్ అమెజాన్  హాట్ సమ్మర్ సేల్ కి తెర లేపింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేకంగా సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ కూడా ఇవే తేదీల్లో బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేయగా, అందుకు పోటీగా అమెజాన్ ఈ సమ్మర్ సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో వినియోగదారులకు పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. 

అమెజాన్ సమ్మర్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లయన్సెస్, టీవీలు, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ పరికరాలపై డిస్కౌంట్లు లభిస్తాయి. అలాగే పలు ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్స్‌ను అందివ్వనున్నారు. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ పద్ధతిలో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసే వీలు కల్పించనున్నారు. మొత్తం 1 వేయికి పైగా బ్రాండ్స్‌పై సుమారుగా 40వేల డీల్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. 

అమెజాన్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై 35 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. అలాగే నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల విలువైన ఆఫర్లను అందివ్వనున్నారు. ఇక సేల్ జరిగే నాలుగు రోజులు రోజూ రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు అమెజాన్ యాప్‌లోనే ప్రత్యేకంగా పలు ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తారు. ఆ ప్రొడక్ట్‌లను కొన్నవారి లోంచి లక్కీ విజేతలను ఎంపిక చేసి రూ.4 లక్షల విలువైన బహుమతులను అందజేస్తారు.

అలాగే ఈ సేల్‌లో మొబైల్ యాక్ససరీలపై 80 శాతం, ఫోన్ కేసెస్‌పై 75 శాతం, బ్లూటూత్ హెడ్‌సెట్లపై 35 శాతం, పవర్ బ్యాంకులపై 70 శాతం, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, కంప్యూటర్ యాక్ససరీలపై 50 శాతం వరకు, వీడియో గేమ్స్‌పై 60 శాతం, సాఫ్ట్‌వేర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్లను అందివ్వనున్నారు. వీటితోపాటు కెమెరాలు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచ్‌లు, స్టోరేజ్ డివైస్‌లపై కూడా ఆఫర్లను అందివ్వనున్నారు.

అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా ఏదైనా ప్రొడక్ట్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తారు. ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఉత్పత్తులను కొంటే అదనంగా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 

loader